తెలంగాణలో ప్రబలుతోన్న వైరస్: గ్రేటర్ హైదరాబాద్ సహా అయిదు జిల్లాల్లో విస్తృతంగా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రతలో మార్పు ఉండట్లేదు. యధాతథంగా కొనసాగుతోంది. కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల నమోదవుతూనే వస్తోంది. శని, ఆదివారాల్లో విడుదలైన బులెటిన్లతో పోల్చుకుంటే తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ.. పూర్తిగా నియంత్రణలోకి రావట్లేదు. వరుసగా రెండో రోజుల పాటు రెండువేల మార్క్‌ను అందుకున్న కరోనా కేసులు.. ఈ సారి రెండు వేలలోపే నమోదు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా అయిదు జిల్లాల్లో దాని దూకుడు కొనసాగుతూనే ఉంది.

Recommended Video

    COVID-19 Cases Cross 1 Lakh Mark In Telangana తెలంగాణ గ్రేటర్ పరిధిలో మళ్లీ పెరుగుతున్న కేసులు!!

    తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా తెలంగాణలో కొత్తగా 1842 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆరు మంది మరణించారు. 1825 మంది డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,06,091కి చేరుకుంది. ఇందులో 82,411 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 761కి చేరుకుంది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 22,919గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 16,482 మంది చికిత్స పొందుతున్నారు.

    1842 Covid19 positive cases and 6 deaths were reported in Telangana last 24 hours

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో కొత్తగా వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల్లో కొత్తగా 373 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. నాలుగు జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు రికార్డు అయ్యాయి. రంగారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట్, నిజామాబాద్ జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు నమదైనట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఆనుకుని ఉన్న జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా కనిపిస్తోంది. రంగారెడ్డిలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంటోంది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోనే ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ.. కొద్దిరోజులుగా వందకు దిగువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.

    24 గంటల్లో కొత్తగా ఆదిలాబాద్-23, భద్రాద్రి కొత్తగూడెం-37, జగిత్యాల-70, జనగామ-24, జయశంకర్ భూపాలపల్లి-1, జోగుళాంబ గద్వాల-33, కామారెడ్డి-20, కరీంనగర్-134, ఖమ్మం-77, కొమరంభీమ్ ఆసిఫాబాద్-5, మహబూబ్ నగర్-42, మహబూబాబాద్-64, మంచిర్యాల-59, మెదక్-13, మేడ్చల్ మల్కాజ్‌గిరి-32, ములుగు-12, నాగర్ కర్నూలు-32, నల్లగొండ-47, నారాయణపేట్-4, నిర్మల్-10, నిజామాబాద్-158, పెద్దపల్లి-44, రాజన్న సిరిసిల్ల-13, రంగారెడ్డి-109, సంగారెడ్డి-50, సిద్ధిపేట్-86, సూర్యాపేట్-113, వికారాబాాద్-11, వనపర్తి-50, వరంగల్ రూరల్-8, వరంగల్ అర్బన్-74, యాదగిరి భువనగిరి-14 కేసులు నమోదు అయ్యాయి.

    24 గంటల వ్యవధిలో మొత్తం 36,282 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 9,68,121కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 2,076 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో మొత్తం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాలు 1076 ఉన్నాయి. వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+