హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా టెర్రర్: నిన్నటి కన్నా తగ్గిన కేసులు.. 2 వేలకు పైగా కేసులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ గత 24 గంటల్లో మాత్రం తగ్గాయి. నిన్న 2707 కేసులు రాగా.. ఇవాళ 2398 కేసులు మాత్రమే వచ్చాయి. కరోనా సోకిన ముగ్గురు చనిపోయారు. రాష్ట్రంలో 21 వేల 676 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పండగ నేపథ్యంలో కేసులు పెరుగుతాయనే ఆందోళన మాత్రం నెలకొని ఉంది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. పండుగ కాలం కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కోవిడ్ ని బంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు వెల్లడిస్తున్నారు.

2398 people infected coronavirus last 24 hours. health officials said statement.

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ 5 కోట్ల మార్క్ దాటింది. మొదటి డోసు 100 శాతం పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ గురువారంతో 5 కోట్ల డోసులను అధిగమించిందని చెప్పారు. ఇందులో మొదటి డోసు 2.93 కోట్లు కాగా, రెండో డోసు 2.06 కోట్లుగా ఉంది. బూస్టర్ డోసు 1.9లక్షల మంది తీసుకున్నారు. వైద్య సిబ్బంది కేవలం కేవలం 35 రోజుల్లోనే కోటి టీకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.

కరోనా కొత్త వేరియంట్లు రూపాంతరం చెందుతున్నాయి. కొన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఒమిక్రాన్.. అంతకుముందు డెల్టా.. రకరకాల వేరియంట్లు భయాందోళన కలిగిస్తున్నాయి. అయితే వీటన్నింటికీ శ్రీరామరక్ష.. వ్యాక్సిన్ తీసుకోవడమే.. అవును నిపుణులు తెలియజేయడంతో అంతా టీకాలు తీసుకుంటున్నారు.

కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.

English summary
2398 people infected coronavirus last 24 hours. health officials said statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X