Hyderabad:కేబీఆర్ పార్కులో మహిళా సినీ నిర్మాతకు వేధింపులు..!
హైదరాబాద్ నడిఒడ్డున కేబీఆర్ పార్కులో ఓ మహిళా నిర్మాతను గుర్తు తెలియని వ్యక్తి వేధించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. జులై 9న ఓ మహిళా సినీ నిర్మాత కేబీఆర్ పార్కులో వాకింగ్ కు వచ్చారు. ఆమె వాకింగ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి ఆమె ముందుకు వచ్చాడు. ఆమెతో వింతగా ప్రవర్తించాడు. శృంగార హావభావాలు ప్రదర్శించాడు. దీంతో ఆమె అతన్ని దాటుకుని వెళ్లింది.
అయితే అతను మళ్లీ వచ్చి మహిళా నిర్మాతను ఫొటో తీయడానికి యత్నించాడు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. గంట వ్యవధిలో ఆ వ్యక్తి మహిళా నిర్మాతను మూడు సార్లు వేధించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమె వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నిందితుడి కారు నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కారు ఎటు వెళ్లిందో సీసీ కెమెరాల్లో పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు పార్కులో ఎవరైనా ఉన్నారా.. లేరా తెలియరాలేదు.

కేబీఆర్ పార్కులోకి ప్రముఖులు వాకింగ్ చేయడానికి వస్తుంటారు. అయితే కేబీఆర్ పార్కులో మహిళలు వేధింపులు గురి కావడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2022లో ఏప్రిల్ లో ఉదయం నడకకు వచ్చిన ఓ మహిళ లైంగిక వేధింపులకు గురయింది. 2021 నవంబర్ లో నటి షాలు చౌరసియా కేబీఆర్ పార్కులో సాయంత్రం నడకకు వెళ్లింది. ఆమెపై గుర్తు తెలియని దుందగులు దాడి చేసి డబ్బులు, బంగారం దొచుకెళ్లారు.
తాజాగా కేబీఆర్ పార్కులో వేధింపులకు గురైన సినీ మహిళా నిర్మాత ఎవరో పోలీసులు బయటకి చెప్పలేదు. ఈ కేసును సీరియస్ తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం వేట కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications