హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

priyanka Reddy Murder: నటి ప్రత్యూష తల్లి స్పందన, కీలక సూచనలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగర శివారులోని శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు 24 గంటలలోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిని అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత మరో ముగ్గురు అనుమానితులు నవీన్ (డ్రైవర్), శివ (క్లీనర్), కేశవ్ (క్లీనర్) అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు.

లవర్‌తో లేచిపోవచ్చు..: ఫిర్యాదు చేస్తే పోలీసుల స్పందన ఇదంటూ ప్రియాంక రెడ్డి తల్లి కన్నీరులవర్‌తో లేచిపోవచ్చు..: ఫిర్యాదు చేస్తే పోలీసుల స్పందన ఇదంటూ ప్రియాంక రెడ్డి తల్లి కన్నీరు

చాలా బాధగా..

చాలా బాధగా..

ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనపై నటి ప్రత్యూష తల్లి స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమైందన్నారు. ఈ ఘటన తన కూతురు ప్రత్యూష ఘటననే గుర్తు చేసిందని అన్నారు. యువతులు, మహిళలు బయటికి వెళ్లినప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలన్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలి..

జాగ్రత్తలు తీసుకోవాలి..

మహిళలు బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రత్యూష తల్లి చెప్పారు. ప్రియాంక రెడ్డి పరిస్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాలని, పోలీసులకు కూడా సమాచారం అందించాలన్నారు. మనం భయపడి ఎదుటివాళ్లకు అవకాశం ఇవ్వకూడదని అన్నారు.

మరణ శిక్ష విధించాలంటూ..

మరణ శిక్ష విధించాలంటూ..

మన జాగ్రత్తే మనల్ని కాపాడుతుందని అన్నారు. ప్రియాంక రెడ్డిపై దారుణానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు ప్రత్యూష తల్లి. వాళ్లకి మరణశిక్ష పడితే మహిళాలోకం ఆనందిస్తుందని, ప్రత్యూష చారిటబుల్ ట్రస్ తరపున అదే కోరుకుంటున్నామని చెప్పారు. కాగా, 2002, ఫిబ్రవరి 23న అప్పుడప్పుడే సినీతారగా ఎదుగుతున్న ప్రత్యూషపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested

తానే పర్యవేక్షిస్తానన్న కేటీఆర్..

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిందితులను పోలీసులు పట్టుకుని, కఠినంగా శిక్షిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం అందేలా చేస్తామన్నారు. ఈ కేసును తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని అన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే 100కి డయల్ చేయాలని చెప్పారు. ప్రియాంక అత్యాచారం, హత్య కేసును సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్రమంత్రుల పరామర్శ.. రెడ్డి కీలక సూచన

రాష్ట్రమంత్రుల పరామర్శ.. రెడ్డి కీలక సూచన

రాష్ట్రమంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, మహమూద్ అలీలు ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. యువతులు, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు వెంటనే షీటీమ్స్‌కు గానీ, పోలీసులకు గానీ సమాచారం అందించాలన్నారు. ప్రియాంక రెడ్డి తన చెల్లికి బదులు పోలీసులకే ఫోన్ చేసివుంటే ఈ దారుణం జగరకపోయి ఉండేది కాదన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
ప్రియాంక రెడ్డి ఘటనపై కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. ఈ కేసు విషయంపై తెలంగాణ డీజీపీ నుంచి పూర్తి వివరాలు తీసుకుంటామని చెప్పారు. తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. నిందితుల తరపున ఏ న్యాయవాది కూడా వాదించకూడదన్నారు.

English summary
Actress Pratyusha's mother response on priyanka Reddy rape and Murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X