హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నీ విద్యాసంస్థలు ఓపెన్.. జూలై 1 నుంచి ప్రారంభం: సబితా ఇంద్రారెడ్డి

|
Google Oneindia TeluguNews

అన్‌లాక్ ప్రకటిస్తూనే తెలంగాణ ప్రభుత్వం కీ డిసిషన్స్ తీసుకుంది. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తున్నామని ప్రకటించింది. కర్ఫ్యూ కూడా లేదు. దీంతోపాటు జూలై 1వ తేదీ నుంచి స్కూళ్లు రీ ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. థర్డ్ వేవ్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న.. కేజీ టు పీజీ వరకు అన్నీ విద్యాసంస్థలను ఓపెన్ చేయాలని స్పష్టంచేసింది. ఇదీ ఒక సాహసోపేత నిర్ణయమే అని చెప్పాల్సి ఉంటుంది.

విద్యాసంస్థల ప్రారంభంపై విద్యాశాఖ అధికారులకు సంబంధిత మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీచేశారు. థర్డ్ వేవ్ భయాందోళన నెలకొన్న వేళ.. పేరంట్స్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అయితే విద్యార్థుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించేలా తప్పనిసరిగా ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది.

all education institutions are open in july 1st

కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేయాలని డిసిషన్ తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ జరిగింది. వైరస్ తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రంలో మే 12వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించారు. తొలుత ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకే బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అత్యవసరం ఉన్నవారు పాసు తీసుకోవాలని కోరారు. తర్వాత దానిని మధ్యాహ్నం 1 గంట వరకు పొడగించారు. 2 గంటల వరకు ఇంటికి చేరుకోవాలని కోరారు. తర్వాత సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూ చేశారు. సాయంత్రం 6 లోపు ఇంటికి చేరుకోవాలని స్పష్టంచేశారు.

Recommended Video

Corona Vaccine విధానంలో కేంద్రం వివక్ష, సగానికి పైగా డోసులు వారికే || Oneindia Telugu

ఆదివారం నుంచి సినిమా థియేటర్లు కూడా ఓపెన్ కానున్నాయి. లాక్ డౌన్ వల్ల సినిమా హాళ్లు దాదాపు మూసివేసి ఉంటున్న సంగతి తెలిసిందే. కేసులు తగ్గడంతో ఓపెన్ చేసేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో సినీ పరిశ్రమకు ప్లస్ కానుంది.

English summary
all education institutions are open in july 1st education minister sabitha indrareddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X