మరో 3 రోజులు వాన.. కాస్త రిలీఫ్.. కానీ ఉక్కపోతతో జనం ఇబ్బందులు

తెలంగాణ రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం 3 అయ్యిందంటే చాలు వాతావరణం మారిపోతుంది. అవును మబ్బులు పడి.. చిన్నగా వర్షం కురుస్తోంది. ఆ వర్షం వల్ల భూమి పూర్తిగా చల్లబడటం లేదు. తర్వాత భూమి నుంచి వేడి నిప్పు కణికల మాదిరిగా వస్తోంది. ఉక్కపోతకు జనాలు ఇబ్బంది పడుతున్నారు.

తెలంగాణ‌ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్ర అధికారులు చెప్పారు. రాష్ట్రంలో గల ప‌లు ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. మ‌రి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని చెప్పారు. ప‌లు చోట్ల‌ అక్క‌డక‌క్క‌డ ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉందని వివ‌రించారు. వర్షంతో భూతాపం తగ్గడం లేదు. కంటిన్యూ కురిస్తే.. ఓకే.. అలా కాకపోవడంతో ఇబ్బంది తప్పడం లేదు.

another three days rain in the telangana state

రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎండ‌ల తీవ్ర‌త పెరిగిపోతోంది. వర్షాల‌తో రాష్ట్రంలోని ప‌రిస్థితులు చ‌ల్ల‌బ‌డ్డాయి. కానీ తర్వాత సేమ్ సిచుయేషన్.. ఉక్కపోత తగ్గడం లేదు. జూన్, జూలైలో రెగ్యులర్‌గా వర్షాలు పడటంతో జనం రిలాక్స్‌గా ఉంటారు. ఇప్పుడు మాత్రం వేడి తగ్గడం లేదు. ఎండల తీవ్రత కూడా అధికంగానే ఉంటుంది. దీంతో ఉక్కపోతతో అల్లాడుతున్నారు. కొన్నిసార్లు పవర్ కూడా ఉండటం లేదు. ఇదీ మరింత ఇబ్బందులకు దారితీస్తోంది. ఏపీలో కరెంట్ కోత ఎక్కువగా ఉంది. కొన్ని పరిశ్రమలకు పవర్ హాలీడే కూడా ప్రకటించారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. కానీ రైతులకు త్రి ఫేజ్ విద్యుత్ పగటిపూట మాత్రమే ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+