ఆ ముగ్గురు ఐరన్ లెగ్: కేసీఆర్, కేటీఆర్, కవితపై అర్వింద్ ఫైర్
మునుగోడు బై పోల్ వేళ బీజేపీ- టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు ఐరన్ లెగ్‌లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ కుటుంబం దత్తత తీసుకున్న గ్రామాలు ఏడుస్తున్నాయని గుర్తుచేశారు. కేటీఆర్ మంత్రిగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. కొత్తగా దత్తత తీసుకొని ఏం చేస్తారని నిలదీశారు. దత్తత పేరుతో ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎలాంటి కామెంట్స్ చేసినా.. జనం నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.

మునుగోడులో బీజేపీ జెండా ఎగరేయాలని ఆ పార్టీ అనుకుంటుంది. ఆ మేరకు కార్యాచరణ రూపొందించుకుంది. అగ్రనేతలను రంగంలోకి దింపింది. అమిత్ షా, జేపీ నడ్డా బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు.
మునుగోడు బై పోల్‌లో విజయం.. రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నీడ్. ఆయన ఓడిపోతే రాజకీయ జీవితం దాదాపు క్లోజ్ అయినట్టే. అందుకోసమే ఆయన ప్రచారం కోసం అగ్రనేతలను దింపుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అతని అనుయాయులు బిజీగా ఉన్నారు. ఇటు బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీపై ఎదురుదాడి చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక్కో ఓటుకు రూ.40 వేలు ఇచ్చేందుకు సిద్ధమైందని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చిన టీఆర్ఎస్... హుజూరాబాద్ ఉప ఎన్నికలో రూ.20 వేలు ఇచ్చిందని ఆరోపించారు. ఇప్పుడు దానిని మరింత రెట్టింపు చేసిందని వివరించారు.












Click it and Unblock the Notifications