ప్లాస్మా దానం చేసిన దక్కని ఫలితం.. కరోనాతో పోరాడి ఓడిన బాచుపల్లి ఎస్సై..
కరోనా వల్ల మరో పోలీసు అధికారి చనిపోయారు. వైరస్‌తో పోరాడి బాచుపల్లి ఎస్సై యూసుఫ్ ప్రాణాలు కోల్పోయారు. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన గత 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే అతనికి ఇటీవలే ప్లాస్మా థెరపీ కూడా చేయగా.. కోలుకుంటున్నారని ఫ్యామిలీ మెంబర్స్ ఆశించారు.
ఎస్సై యూసుఫ్‌కు ప్లాస్మా అవసరం అని కానిస్టేబుల్ సాయి కుమార్ తెలుసుకున్నారు. బక్రీద్ రోజున ప్లాస్మా దానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముస్లిం ఎస్సైకి హిందూ కానిస్టేబుల్ ప్లాస్మా దానం చేయడం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. అదీ కూడా ముస్లింలు పవిత్రంగా భావించే బక్రీద్ కావడం విశేషం. సాయికుమార్ చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

Recommended Video
యూసుఫ్‌కు ప్లాస్మా దానం చేసిన విషయాన్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. భారతీయుల మతం, మానవత్వం.. హైదరాబాద్ పోలీసులు అని తెలిపారు. అయితే యూసుఫ్‌కు ప్లాస్మా ద్వారా చికిత్స చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ఆయన చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications