BC Students కోసం కేసీఆర్ మార్క్ డెసిషన్..మెరిట్ ఉంటే నో పేమెంట్..!
హైదరాబాద్ : తెలంగాణ బీసీ విద్యార్థులకు ఎన్నికల వేళ గుడ్‌న్యూస్ చెప్పింది కేసీఆర్ సర్కార్. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే ఎడ్యుకేషన్ ఫీజులు చెల్లిస్తుండగా తాజాగా ఈ విధానాన్ని బీసీ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అయితే ఇక్కడ ఓ కండీషన్ విధించింది.
ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వాలు ఫీజులు చెల్లిస్తుండగా తాజాగా బీసీ విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న 200 అత్యుత్తమ విద్యాసంస్థల్లో సీటు పొందిన బీసీ విద్యార్థులకు మాత్రమే ఈ ఫీజు చెల్లింపులు పూర్తిస్థాయిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్శిటీలు కూడా ఉన్నాయి.

ఇక టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్‌టిట్యూషన్స్‌లో సీటు పొందిన బీసీ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో చాలామంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
ఫీజులు చెల్లించే ప్రక్రియలో భాగంగా అవసరమైన చర్యలు చేపట్టాలని బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలు ఇచ్చారు.కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 10వేల మంది బీసీ విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఇందుకోసం అదనంగా ఏడాదికి రూ.150 కోట్లు వెచ్చించనున్నట్లు మంత్రి కమలాకర్ వివరించారు.

ఇప్పటికే విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న బీసీ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్‌లను అందించడంతో పాటు ఫీజు రీఇంబర్స్‌మెంట్ కూడా ఇస్తోంది.దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చదువుతున్న బీసీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు చెల్లింపులు చేపడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.












Click it and Unblock the Notifications