సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత: కేసీఆర్, చంద్రబాబు సంతాపం

భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ సాయన్న కన్నుమూశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు.

హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ సాయన్న(72) కన్నుమూశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా సాయన్న కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. ఫిబ్రవరి 16న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సాయన్న.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు.

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా సాయన్న ఉన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 1994 నుంచి 2015 వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. 2015లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన.. 2018లో మరోసారి కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

BRS cantonment MLA G Sayanna passed away.

1951 మార్చి 5న సాయన్న చిక్కడపల్లిలో జన్మించారు. తెలుగుదేశం పార్టీ తరపున 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2014 తర్వాత సాయన్న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సాయన్నకు భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. సాయన్న కూతురు కూడా రాజకీయాల్లో ఉన్నారు.

సాయన్న మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయన్న మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సాయన్న మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయన్న కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు.

సాయన్న మృతి పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయన్న కుటుంబసభయులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రార్థించారు.

సాయన్న మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయన్న అందరితో ఆత్మీయంగా మాట్లాడేవారన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సాయన్న మృతిపై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'సౌమ్యుడు, సుదీర్ఘ రాజకీయ జీవితంలో నగర ప్రజలకు ఎనలేని సేవలు అందించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాలమరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ... కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+