హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమిత్ షా-జూ.ఎన్టీఆర్ మాట్లాడుకుంది ఇదే- కిషన్ రెడ్డి ఫుల్ క్లారిటీ-కొడాలి కామెంట్స్ పైనా

|
Google Oneindia TeluguNews

నిన్న ఓ హోటల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీ జరిగింది. అమిత్ షా ఆహ్వానం మేరకు విందుకు హాజరైన జూనియర్ ఆయనతో ఏం మాట్లాడారారన్న దానిపై పలు ఊహాగానాలు చెలరేగాయి. కొందరు బీజేపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయబోతున్నారని ఊహిస్తుంటే, మరికొందరు ఆయన టీడీపీ-బీజేపీ మధ్యవర్తిత్వం కోసం వెళ్లారని చెవులు కొరుక్కుంటున్నారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

Recommended Video

ఎన్టీఆర్ పొలిటికల్ గా ఆసక్తితో ఉన్నారా?పక్కా ప్లాన్ *Politics | Telugu FilmiBeat

అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీలో ఏం జరిగిందనే దానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆచితూచి స్పందించారు.జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా భోజనానికి ఆహ్వానించారని ఆయన తెలిపారు. వారిద్దరూ సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా అమిత్ షా.. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి జూనియర్ ను అమిత్ షా అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. టీడీపీ స్దాపించినప్పుడు ఎన్టీఆర్ ఎలా పర్యటనలు చేశారన్నది అడిగారని కిషన్ రెడ్డి తెలిపారు.

central minister kishan reddy clarified on what happened in amit shah-junior ntr meeting

అలాగే అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీలో రాజకీయాల గురించి మాత్రం ప్రస్తావన రాలేదని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు మాత్రం జరగలేదన్నారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచారానికి వాడుకోబోతోదంటూ వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మాత్రం తాను స్పందించబోనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య చర్చల్లో మాత్రం కేవలం సినిమాలపై మాత్రమే చర్చ జరిగినట్లు తాను చెప్పగలనన్నారు.

English summary
union minister kishan reddy on today reacted on rumours over amit shah and jr ntr's recent meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X