దళితబంధుపై దద్దరిల్లిన అసెంబ్లీ: భట్టి ప్రశ్నల వర్షం.. ఆన్సర్ కావాలంటూ..
దళితబంధు అంశంపై తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. దళితబంధు పథకానికి నిధులు ఎలా కేటాయిస్తారు.. అని వివిధ అంశాలపై నిలదీశారు. తాను లెవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. బై పోల్ నేపథ్యంలో పథకం తీసుకొచ్చారా అని అడిగారు.

ఒక్క వ్యాపారమే చేసుకోవాలా..?
దళితబంధు పథకానికి అర్హులైన వారు రూ.10 లక్షలతో ఒకే ఒక్క వ్యాపారం మాత్రమే చేసుకోవాలా.. లేదంటే నచ్చిన వ్యాపారాలు చేసుకోవచ్చా అని భట్టి విక్రమార్క అడిగారు. దళితులు ఓ బృందంగా ఏర్పడి పెద్ద వ్యాపారాలు చేసుకోవచ్చా అని సందేహాం వ్యక్తం చేశారు. పథకం లబ్దిదారులు స్థానికంగానే ఉండాలా? లేక ఎక్కడైనా చేసుకోవచ్చా? అని కొశ్చన్ చేశారు. వ్యాపారాలు చేసుకునేందుకు అనువైన వ్యవస్థలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందా? లేదంటే దళితబంధులో భాగంగా అర్హులైన వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారా? అని అడిగారు. రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? వారిని అనర్హులుగా పరిగణిస్తారా? వివాహ ధ్రువీకరణ పత్రాలు ఉంటే సరిపోతుందా? అని ప్రశ్నలు సంధించారు.

స్పష్టత ఇవ్వండి..
తన సందేహాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యంగా, దళితబంధు పథకానికి నిధులు ఎక్కడ్నించి తెస్తారన్నది తెలిస్తే, సభలో చర్చించడానికి తగిన వాతావరణం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. దళితబంధు లబ్దిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా సాగాలని, అర్హులందరికీ న్యాయం జరగాలని పేర్కొన్నారు. దళితబంధు పథకానికి సంబంధించిన కమిటీల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులకు స్థానం కల్పించాలని సూచించారు.

ఎన్నికల స్టంటేనా..?
హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications