29 శాతం బోనస్.. గతేడాది కన్నా ఒక శాతం ఎక్కువ, సింగరేణి కార్మికుల బోనస్

ఏటా సింగరేణి కార్మికులకు ప్రకటించే బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సారి కాస్త ఎక్కువగా అనౌన్స్ చేసింది. దసరా ముందు కార్మికులకు బోనస్ ప్రకటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా బోసన్ అనౌన్స్ చేశారు. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కార్మికులందరికీ బోనస్ ప్రకటిస్తూ ప్రకటన చేశారు. దసరా పండుగకు ముందే వారికి బోనస్ అందజేయాలని సింగరేణి సీఎండీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కార్మికుల ఖాతాల్లో బోనస్ జమకానుంది. దసరా పండుగకు ముందే వారి మెములో చిరునవ్వు విరబూయనుంది.

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్యకలాపాలను మరింత విస్తరించాలని ఆయన చెప్పారు. ఇసుక, ఇనుము, సున్నపురాయి తవ్వకాల్లో విస్తరణ జరగాలని సూచించారు. బొగ్గుగని, విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్నామని కేసీఆర్ అన్నారు. సంస్థను అగ్రగామిగా నిలపడంలో కార్మికులదే గొప్ప కృషి అని ప్రశంసించారు.

cm kcr announced to bonus singareni workers

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం బాధాకరం అని తెలిపారు. లాభాల్లో 29 శాతాన్ని కార్మికులకు బోనస్‌గా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇది గతేడాది ప్రకటించిన బోనస్‌ కన్నా ఒక శాతం ఎక్కువ అయిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమపై సీఎం కేసీఆర్ మరోసారి దాతృత్వం చాటారని పేర్కొన్నారు. గతేడాది 28 శాతం బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Recommended Video

    అభివృద్దిలో తెలంగాణ దూసుకెళ్తోందన్న మంత్రి కేటీఆర్!! || Oneindia Telugu

    బోనస్ వల్ల కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒక్కొక్కరికీ రూ. లక్ష పైగానే బోనస్ జమకానుంది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో రూ.60 వేల వరకు జమ అయింది. ఇప్పుడు అదీ పెరిగిపోయింది. కంపెనీకి లాభాలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ తెలియజేశారు. ఏటా వారి బోనస్ పెంచుతున్నారు. అలాగే కంపెనీకి లాభాలు కూడా పెరుగుతున్నాయి. ఉద్యోగులకు బోనస్ పెరుగుతూ వస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+