హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమ్మెపై రంగంలోకి దిగిన సిఎం కేసీఆర్, ఆదివారం ఉన్నతాధికారులతో సమావేశం

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మెపై తేల్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం సీఎం కేసిఆర్ నేరుగా రంగంలోకి దిగనున్నారు. సమ్మె పరిణామాలు, కార్మికుల డిమాండ్లపై సీఎం ఆధ్యర్యంలో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు, ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. దసరా సీజన్ కావడంతో ఓ వైపు ప్రజల నుండి ఒత్తిడి పెరుగుతుండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు వారితో చర్చలకు దిగింది. ఇక కార్మికులు సైతం సమ్మెను ఉధృతం చేసేందుకు ఇతర సంఘాల మద్దతు కోరుతున్నారు. ఇందుకోసం ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు.

తెలంగాణాలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె .. బస్సులు బంద్ .. డిపోల వద్ద 144 సెక్షన్తెలంగాణాలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె .. బస్సులు బంద్ .. డిపోల వద్ద 144 సెక్షన్

 ప్రభుత్వంపై సమ్మె ఒత్తిడి

ప్రభుత్వంపై సమ్మె ఒత్తిడి

పండగవేళ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో అటు ప్రభుత్వం ఇటు కార్మికులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం సమ్మెపై మొండిగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఎదుర్కోంటుంది. నెల రోజుల ముందు కార్మీకులు నోటీసులు ఇచ్చినా స్పందించన ప్రభుత్వం హడావిడిగా సమస్యల పరిష్కారం కోసం అంటూ అయిదు రోజుల ముందు త్రిసభ్య కమిటీని నియమించింది. దీంతో కార్మిక సంఘాలు కమిటీ ముందు తమ డిమాండ్లను పెట్టారు. అయితే వాటిని ప్రభుత్వానికి వివరిస్తామని కమిటీ చేతులు దులుపుకోవడంతో సమ్మెను కొనసాగించేందుకు కార్మికులు నిర్ణయించారు. దీంతో శుక్రవారం అర్థరాత్రీ నుండి కార్మికులు సమ్మెలోకి దిగారు.

ప్రభుత్వ తీరుపై ప్రజల ఆగ్రహం

ప్రభుత్వ తీరుపై ప్రజల ఆగ్రహం

పండగకు రెండు రోజుల ముందు బస్సులు బంద్ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న ప్రజలు ప్రభుత్వం తీసుకునే చర్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. సమస్యను అధికారులకు వదిలిపెట్టి ముఖ్యమంత్రితో మంత్రులు సైతం పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు. కనీసం కార్మికులతో సంబంధిత మంత్రి కూడ వారితో చర్చలు జరపలేని పరిస్థితిలో వ్యవహరించారు. దీనికితోడు శనివారం సాయంత్రం 6 గంటల వరకు విధుల్లోకి చేరాలని డెడ్‌లైన్ విధించారు. కాని ప్రభుత్వం డెడ్‌లైన్‌ను లెక్క చేయని కార్మికులు సమ్మెను కొనసాగించేందుకే నిర్ణయించారు.

కార్మికులు దిగిరాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

కార్మికులు దిగిరాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు


ప్రభుత్వ చర్యలతో కార్మికులు తమ సమ్మెను ఉదృతం చేసేందుకు సన్నద్దమయ్యారు. వారితో చర్చలు జరపడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం ప్రభుత్వం చేస్తోంది. కార్మికులు దిగిరాకపోతే తాత్కలిక పద్దతిన నియమించిన డ్రైవర్లు, కండక్టర్లను రంగంలోకి దింపాలని భావిస్తోంది. బస్సులపై కార్మికులు దాడులు చేస్తుండడంతో అందుకు అనుగుణంగా భద్రత కల్పించేందుకే సీఎం కేసిఆర్ పోలీసులను అదేశించనున్నారు. ఇందుకోసమే రేపటి సమావేశంలో పోలీసు అధికారులు సైతం హజరుకానున్నట్టు తెలుస్తోంది.

English summary
telangana cm kcr along with officials are going to discuss about Rtc strike on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X