హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎట్ హోం: సీఎం కేసీఆర్ గైర్హాజరు, మంత్రులు కూడా.. సీఎస్ ఒక్కరే హాజరు

|
Google Oneindia TeluguNews

జెండా పండుగ వైభవంగా జరిగింది. గోల్కొండ కోట మీద జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తర్వాత ప్రసంగించారు. తమ ప్రభుత్వం చేసిన, చేస్తోన్న అంశాలను ప్రస్తావించారు. అంతకుముందు ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను కేసీఆర్ ఎగరవేశారు. సాయంత్రం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఎట్ హోం నిర్వహించారు. దానికి మాత్రం కేసీఆర్ హాజరుకాలేదు.

ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్ హోమ్ నిర్వహించారు. కార్యక్రమానికి రావాల్సిన సీఎం కేసీఆర్ చివరి నిమిషంలో హాజరుకాలేదు. ఎట్ హోమ్ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ వస్తున్నారని రాజ్ భవన్ వర్గాలకు సీఎంవో నుంచి సమాచారం అందింది. లాస్ట్ మినిట్ ఏం జరిగిందో తెలియరాలేదు.

cm kcr has not attended at home programme

ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరం కాగా, సీఎస్ సోమేశ్ కుమార్, మరికొందరు ఉన్నతాధికారులు మాత్రమే ప్రభుత్వం తరఫున ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు, ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా కనిపించలేదు. గవర్నర్ తమిళి సైతో కేసీఆర్ మధ్య పొసగడం లేదు. కోల్డ్ వార్ జరుగుతుంది.

అయినప్పటికీ బహిరంగ వేదికలపై ఆడపా దడపా కలుస్తున్నారు. కానీ ఇవాళ మరోసారి హాజరుకాలేదు. దీంతో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతుంది. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ విషయం గొడవ జరిగిన సంగతి తెలిసిందే.

English summary
cm kcr has not attended at home programme. event was conducted by governer tamili sai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X