హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు ఓరుగల్లుకు సీఎం కేసీఆర్.. పంటల పరిశీలన, అన్నదాతలకు భరోసా

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. భేటీలో ధాన్యం కొనుగోలుపై చర్చ జరిగింది. వానాకాలం ధాన్యం కొనుగోలు జరుగుతున్న పరిస్థితులపై డిస్కష్ చేసింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు దాదాపు పూర్తి కావచ్చింది. అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా కూడా కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు పూర్తిగా అయ్యేంతవరకు కేంద్రాలను కొనసాగించాలని సూచించింది.

ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపడుతారు. రేపు పరకాల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. అకాల వర్షానికి జరిగిన పంట నష్టాన్ని సీఎం చూస్తారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సిఎం కేసీఆర్‌తో పాటు పర్యటనలో పాల్గొననున్నారు.

cm kcr tomorrow visit warangal district. he observe paddy

హనుమకొండ జిల్లాలో గల పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం, నడికూడ మండలంలో, నర్సంపేట మండలంలో అకాల వర్షానికి పంట నష్టం జరగడంతో కేసీఆర్ దృష్టికి జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీసుకెళ్లారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని.. తాను స్వయంగా పంట నష్టం జరిగిన పొలాల దగ్గరకు వస్తానని హామీ ఇచ్చారు.

కరోనా కేసులు పెరుగుతున్న.. రికవరీ రేటు కూడా అదేస్థాయిలో ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. కరోనా కేసుల నేపథ్యంలో కర్ఫ్యూ, స్కూళ్ల సెలవుల పొడగింపు.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూల్స్ పున: ప్రారంభం.. కర్ఫ్యూ విధిస్తే మార్కెట్‌పై ప్రభావం తదిరత అంశాల గురించి డిస్కష్ చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు.. ప్రస్తుత పరిస్థితిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. సమావేశంలో వివరించారు. ఎలాంటి పరిస్థితిని అయిన ఎదుర్కొంటామని చెప్పారు. దీంతో కర్ఫ్యూ విధించడానికి మంత్రివర్గం సానుకూలంగా లేదు. కరోనాను స్వీయ నియంత్రణతోనే తరిమి కొట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

English summary
cm kcr tomorrow visit warangal district. he observe paddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X