దాడులు జరుగుతున్నాయి.. భద్రత కావాలి.. డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు సెక్యూరిటీ పెంచాలని కోరుతూ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ నేతలపై జరిగిన దాడుల గురించి ఆయనకు వివరించారు. తనతో పాటు పొన్నం ప్రభాకర్, వంశీచంద్ రెడ్డి, రోహిత్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. పోలింగ్ సమయంలో కాంగ్రెస్ లీడర్లపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో డీజీపీ ని అడిగి తెలుసుకున్నారు.

మంగళవారం జరగనున్న కౌంటింగ్ సందర్భంగా కూడా కాంగ్రెస్ నేతలపై దాడులు జరిగే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్లకు భద్రత పెంచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన డీజీపీ.. భద్రత పెంచే విషయంలో ఆయా జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై దాడులు చేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications