బెంజ్ కారులో వచ్చి.. తనను తాను కాల్చుకొని...
హైదరాబాద్ : నగర శివారులో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి .. కారులో ఉండి పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకోవడం సంచలనం కలిగించింది. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
కాల్పుల కలకలం ..
ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు బెంజ్ కారులో యూఎస్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఫైజల్ అహ్మద్ వచ్చాడు. ఆ వెంటనే తనతో తీసుకొచ్చిన గన్‌తో పాయింట్ బ్లాంకులో కాల్చుకున్నాడు. అక్కడ పడి ఉన్న ఫైజల్‌ను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొనఊపిరితో ఉండటంతో అతనిని రాయదుర్గంలో గల కేర్ ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకోవడంతో అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు.

విషమంగానే ...
కారులో ఫైజల్ ఒక్కరే ఉన్నాడని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. సెల్ ఫోన్, తుపాకీ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఫైజల్ స్వస్థలం మాసాబ్ ట్యాంకు అని పేర్కొన్నారు. సల్మాన్ అహ్మద్ కుమారుడిగా గుర్తించామని తెలిపారు. ఫైజల్ యూఎస్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడని .. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. అప్పుల బాధలేక తాళలేక సూసైడ్ అటెంప్ట్ చేశాడని పేర్కొన్నారు. గన్ ఫైజల్‌దేనా ? లేదంటే ఎవరి అనే కోణంలో విచారిస్తున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications