జయరాం హత్య కేసు: మూడ్రోజుల పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి
హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళవారం నాడు నాంపల్లి కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులను రెండు వారాల పాటు కస్టడీకి అనుమతించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కానీ నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
అనంతరం కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు రేపటి (బుధవారం) నుంచి కస్టడీలోకి తీసుకుంటారు. ఈ కేసుకు సంబంధించి కొందరిని ప్రశ్నించామని అధికారులు చెబుతున్నారు.

జయరాం హత్య కేసులో రాకేష్ రెడ్డి, మరో నిందితుడిని కోర్టు తమ కస్టడీకి ఇచ్చిందని ఏసీపీ శ్రీనివాస రావు చెప్పారు. జయరాం, రాకేష్ రెడ్డి నడిపిన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తామని చెప్పారు. రాకేష్ వెల్లడించే అంశాలను ఆధారంగా కేసును ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. కొంతమందిని విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశామన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications