సిగ్గు, ఎగ్గు లేని... biggboss-6పై సీపీఐ నారాయణ సెటైర్లు
తెలుగు బిగ్ బాస్-6 సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. 20 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీని గురించి ఎంత విమర్శలు చేస్తోన్నా.. జనాలు మాత్రం షో చూస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ వద్దని.. చాలా మంది సూచనలు చేస్తారు. అందులో ఒకరు సీపీఐ నారాయణ.. ఆ షో గురించి ఆయన దారుణంగా కామెంట్స్ చేస్తారు. మరోసారి ఆయన స్పందించారు.

21 మంది కంటెస్టెంట్లు
బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్-6కు కూడా నటుడు అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్ చేస్తున్నారు. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లారు. బిగ్ బాస్ షోను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సిగ్గు, యెగ్గు లేని జంతువులు ఏమైనా చేయగలవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నాచెల్లెళ్లు కానోళ్లు, పిటపిటలాడే అందంతో ఉన్న ముక్కు ముఖం తెలియని వాళ్లు... అచ్చోసిన ఆంబోతుల్లా అక్కినేని నాగార్జున కనుసన్నల్లో వంద రోజులపాటు బూతుల స్వర్గంలో విలువైన సమయాన్ని వేస్ట్ చేసే బిగ్ బాస్ వచ్చేస్తోందని మండిపడ్డారు.

దేశ సంపద ఉత్పత్తి
సమాజానికి ఉపయోగపడాల్సిన యువత దేశ సంపద ఉత్పత్తికి ఉపయోగపడకుండా... బూతుల స్వర్గాన్ని ఉత్పత్తి చేస్తారా? అని సీపీఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి షోలను ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి చూస్తారని అన్నారు. ఈ షో నుంచి తమకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని ప్రేక్షకులు అడగాలని చెప్పారు. పెళ్లాలను వదిలేసిన మొగుళ్లు, మొగుళ్లను వదిలేసిన పెళ్లాలు అచ్చోసిన ఆంబోతుల్లా జీవించండని సందేశం ఇస్తారేమో అని ఎద్దేవా చేశారు.

కాసులకు కక్కుర్తిపడి
కాసులకు కక్కుర్తిపడే సిగ్గులేని వ్యక్తులు ఉన్నంత కాలం ఈ పాపాలకు ఆదరణ ఉంటుందని నారాయణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో ద్రౌపదీ వస్త్రాపహరణం వర్ధిల్లుతూనే ఉంటుందని విమర్శించారు. ఇందులో సందేహానికి తావులేదని చెప్పారు. షో వల్ల పార్టిసిపెంట్లకు ఒనగూరే ప్రయోజనం ఏంటీ అని అడుగుతున్నారు. జనాలు కూడా చూడటం వల్లే వారికి ఆదాయం వస్తోందని అన్నారు. పక్కన పెడితే.. బిగ్ బాస్ లేదు.. ఏ బాస్ ఉండదని చెప్పారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications