కంచె చేను మేసింది.. కస్టోడియనే కాజేశాడు, రూ.9 లక్షలు చోరీ,
కంచె చేను మేసింది. అవును రక్షించాల్సిన భక్షకుడు కాజేశాడు. నగదు డిపాజిట్ చేసినట్టు చేసి.. దొంగిలించాడు. అతని స్నేహితుడి సాయంతో చోరి చేశాడు. ఒక్కటి కాదు రెండు రూ.9 లక్షలు మాయం కావడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఖాకీలు.. కస్టోడియన్ వివరాలు ఆరాతీయగా జరిగిన చోరీ వెలుగుచూసింది. ఇద్దరీ నుంచి తస్కరించిన నగదును అధికారులు రికవరీ చేశారు.

ఇద్దరు కలిసి..
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బసువుపల్లికి చెందిన చదర్ల వినయ్ ఉప్పల్ శాంతినగర్‌లో ఉండేవాడు. అయితే ఆయన సికింద్రాబాద్ సెక్యూర్ వ్యాల్యూ ఇండియా లిమిటెడ్‌లో కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు. బ్యాంక్ ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేస్తుండేవాడు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల గ్రామానికి చెందిన కొండా రాఘవేందర్‌గౌడ్ బేగంపేట భవాని బాయ్స్ హాస్టల్‌లో ఉండేవాడు. ఏటీఎంలలో డబ్బు డిపాటిట్ చేసి సికింద్రాబాద్ ప్రకాష్ నగర్‌లోని రైటర్ సేఫ్‌గార్డ్‌లో పనిచేశాడు. వినయ్, రాఘవేందర్‌గౌడ్ ఇద్దరు స్నేహితులు.

ఉద్యోగం కోల్పోవడంతో..
కరోనా వైరస్ వల్ల రాఘవేందర్‌గౌడ్ ఉద్యోగం మానేశాడు. ఏటీఎంలో నగదు కాజేయాలని ఇద్దరు కలిసి ప్రణాళిక రచించారు. ఈ నెల 11వ తేదీ ఉదయం వినయ్, తన సహోద్యోగి కాకళ్ల లింగస్వామితో కలిసి హయత్‌నగర్ బొమ్మలగుడి, రాజరాజేశ్వరి కాలనీలో గల హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ ఏటీఎంలో రూ. 13 లక్షల నగదు డిపాజిట్ చేశారు. మరుసటి రోజు సాయంత్రం వినయ్ సదరు ఏటీఎం సేఫ్ డోర్ కాంబినేషన్‌ను రాఘవేందర్‌కు అందజేశాడు. 13వ తేదీన రాఘవేందర్‌గౌడ్ ఏటీఎం సేఫ్‌డోర్ కాంబినేషన్ ఉపయోగించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం నుంచి రూ. 9 లక్షలు తీశాడు. వారిద్దరూ ఆ డబ్బును పంచుకున్నారు.
Recommended Video

రంగంలోకి క్రైం టీం..
ఏటీఎం నుంచి నగదు దొంగిలించారని బ్యాంకు అధికారులు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నాగార్జున.. క్రైమ్ టీం రంగంలోకి దిగి సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఏటీఎం సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారే చోరీ చేసి ఉండొచ్చని భావించారు. కస్టోడియన్ వివరాలను సేకరించారు. నిందితులను ఉప్పల్‌లో గురువారం విచారించారు. నేరం అంగీకరించడంతో వినయ్ నుంచి రూ. 4.48 లక్షలు, రాఘవేందర్‌గౌడ్ నుంచి రూ. 4.47 లక్షల నగదు రికవరీ చేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications