హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గులాబీ గూటికి: సీఎం కేసీఆర్ సమక్షంలో పెద్దిరెడ్డి చేరిక.. హుజురాబాద్ జిల్లా అంటూ..

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. ఇవాళ గులాబీ బాస్‌ కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్నారు. పార్టీ మార్పుకు సంబంధించి స్వయంగా పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరతానని చెప్పారు. హుజూరాబాద్‌ను జిల్లా చేయడం కోసం ప్రయత్నిస్తే తప్పకుండా జరిగేదని వివరించారు. అప్పట్లో నేతలు అలా వ్యవహరించలేదని.. స్వార్థం చూసుకున్నారని ఆరోపించారు.

అభివృద్ది పథం..

అభివృద్ది పథం..

ప్రభుత్వానికి అనుకూలమైన అభ్యర్థిని ఎన్నుకుంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు రాజకీయ జీవతం ప్రసాదించింది హుజూరాబాద్ ప్రజలేనని పెద్దిరెడ్డి వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి...మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీలో చేరికను వ్యతిరేకించారు. రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అప్పటి నుంచే బీజేపీలో ఇమడలేకపోయారు.

కినుక

కినుక

ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సమయం నుంచే పెద్దిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పని చేశారు. టీడీపీలో ఉన్నంత కాలం కరీంనగర్ జిల్లాలో ఆయన బలమైన నాయకుడిగా వెలుగు వెలిగారు. తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థంగా మారిన నేపథ్యంలో బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ కమలం గూటికి చేరడంతో పెద్దిరెడ్డి కినుక వహించారు. పార్టీ మారక తప్పలేదు.

దేవేందర్ గౌడ్‌తో సన్నిహిత్యం..

దేవేందర్ గౌడ్‌తో సన్నిహిత్యం..

పెద్దిరెడ్డి టీడీపీలో బలమైన నేతగా ఉన్నారు. దేవేందర్ గౌడ్‌తో సన్నిహితం ఉండేది. ఆయన నవ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో పెద్దిరెడ్డి కీ రోల్ పోషించారు. తర్వాత ఎవరి దారి వారిదే అయ్యింది. బీజేపీలో చేరినా.. తగిన ప్రాధాన్యం లభించలేదు. ఈటల రాజేందర్ పార్టీలో చేరడంతో.. ఇమడలేకపోయారు.

పెద్దిరెడ్డి కార్మిక నేతగా మంచి గుర్తింపు ఉంది. యూనియన్ ఎన్నికల్లో ఆయన వర్గం ఎప్పుడూ విజయాలు సాధిస్తూ వచ్చేది. టీడీపీ అధికారంలో ఉన్నా.. లేకున్నా కార్మిక నేతగా మంచి పేరు సంపాదించారు. కానీ రాజకీయంగా మాత్రం ప్రభ కోల్పోయారు. చంద్రబాబు హయాంలో వెలుగు వెలిగినా.. తర్వాత సమయం మాత్రం కలిసిరాలేదు. మంత్రిగా పనిచేసి.. అంతకన్నా తక్కువ స్థాయిలోనే ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్‌లో చేరినక ఆయనకు ఎలాంటి పదవీ ఇస్తారో చూడాలీ మరీ.

బల ప్రదర్శన..

బల ప్రదర్శన..

హుజూరాబాద్‌ హీటెక్కుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల పోటాపోటీ బలప్రదర్శనకు వేదిక అవుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సోషల్ మీడియాలో ఈటల బావమరిది చేశాడంటూ చేిసన వాఖ్యలు నియోజకర్గంలో దుమారం లేపాయి. దళితులను కించపరిచినట్టు ఉన్నాయని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ... ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దగ్గం చేశారు. వాట్సాప్ వ్యవహారంపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది దళితులు ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు.

 అభ్యర్థి ఎవరంటే..

అభ్యర్థి ఎవరంటే..

హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిపై స్పష్టత కొరవడింది. చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. పాడి కౌశిక్ రెడ్డి, స్వర్గం రవి, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి కూడా ఆ జాబితాలో ఉన్నారు. మరీ టికెట్ ఎవరికీ ఇస్తారు.. ఎవరు పనిచేస్తారో చూడాలీ. అందరూ కలిసి పనిచేస్తారో లేదో అనే అంశంపై కొద్దిరోజుల్లోనే క్లారిటీ రానుంది.

English summary
ex bjp leader Enugala Peddi reddy join trs party today infront of cm kcr. he want only huzurabad development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X