27 శాతం ఐఆర్ ప్రకటించండి, ప్రభుత్వానికి రామచంద్రరావు డిమాండ్..
ఉద్యోగుల జీతాల పెంపుపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్ష నేతలు కూడా గత కొద్దీ రోజులుగా ఉన్న డిమాండ్‌ను లేవనెత్తుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చే లోపే.. సీఎం కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని కోరారు.
ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని కోరారు. పీఆర్సీ ఆలస్యమైతే.. వెంటనే ఐఆర్ ఇవ్వాలని రామచంద్రరావు కోరారు. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మూడు డీఏలు ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఒక్క డీఏ మాత్రమే ఇచ్చిందని గుర్తుచేశారు. మరీ మిగతా రెండు డీఏల సంగతి ఏంటీ అని అడిగారు. ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. యూనివర్సిటీలకు వీసీలు, ప్రొఫెసర్లను నియంచాలని కోరారు.

భార్యాభర్తలు ఒకే చోట ఉద్యోగం చేసేలా బదిలీలు చేస్తామని ముఖ్యమంత్రి మాట తప్పారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు. ఈ హామీ కోసం ఉద్యోగులు వేచి చూస్తున్నారని తెలిపారు. వెంటనే బదిలీలు చేపట్టాలని.. దీంతో దంపతులకు మేలు జరుగుతుందని వివరించారు. దీంతో ఉద్యోగ సంఘాలు హర్షిస్తాయని తెలిపారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications