రేపటినుంచే ఒంటిపూట బడులు, ఎప్పటి వరకు అంటే.. సెలవులు ఇప్పుడే
అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో జనం మధ్యాహ్నా వేళలో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. సాయంత్రం ఉక్కపోత ఎక్కువగానే ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఒంటిపూట బడులు
ఎండలు అధికంగా ఉండటంతో పాఠశాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బడులు నిర్వహిస్తామని స్పష్టంచేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించాలని అన్ని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. ఏప్రిల్ 23 తేదీ వరకు రాష్ట్రంలో ఒక పూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ వివరించింది.

లాస్ట్ వర్కింగ్ డే
ఎండలు అధికంగా ఉండటంతో పాఠశాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బడులు నిర్వహిస్తామని స్పష్టంచేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించాలని అన్ని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. ఏప్రిల్ 23 తేదీ వరకు రాష్ట్రంలో ఒక పూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ వివరించింది.
Recommended Video

రెండేళ్లు నో
కరోనా వల్ల దాదాపు రెండేళ్లు స్కూల్స్ సరిగా నడవలేదు. అంతా ఆన్ లైన్ క్లాసులు జరిగాయి. గత రెండు మూడు నెలల నుంచి పరిస్థితి మారింది. ఈ లోపు వేసవి ప్రారంభం అయ్యింది. ఇంకేముంది.. విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019లో ఒంటిపూట బడులు నిర్వహించగా.. మళ్లీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవనుంది. దీంతో విద్యార్థులు తమకు పూర్తిగా సెలవులు వచ్చేశాయని ఉత్సాహంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications