హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంత ప్రజల బెంబేలు

|
Google Oneindia TeluguNews

సంక్రాంతి ముందు వాతావరణం మారింది. తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇటు హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చల్లటి వాతావరణంతోపాటు పలుచోట్ల వర్షాలు కురిశాయి. దీంతో ఉదయం వేళ బయటకు వచ్చేవారు ఇబ్బంది పడ్డారు. పిల్లలకు సంక్రాంతి సెలవులు రావడంతో స్కూల్‌కు వెళ్లడం తప్పింది. కానీ మిగతా వారు ఆఫీసు వెళ్లడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, హస్తినపురం, మీర్‌పేటలో చిరుజల్లులతో వర్షం కురిసింది. ఇటు నాంపల్లి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, కోఠి, గోషామహల్, చాదర్ ఘట్, అంబర్ పేట, హిమాయత్‌నగర్, రామంతపూర్, చే నంబర్, గోల్నాక, ఉప్పల్, సైదాబాద్, మలక్‌పేట్‌, దిల్‌షుఖ్‌నగర్‌లో భారీగా వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమయ్యింది. ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటుంది.

heavy rain lashes all over Hyderabad

చినుకు పడితేనే నగరం చిత్తడి అయిపోతుంటుంది. నగరంలో వర్షపు నీరు నిలవడంతో లోతట్టు ప్రాంతాల వారు ఇబ్బందికి గురవుతుంటారు. తమ సమస్య పరిష్కరించమని ఎన్ని సార్లు ప్రభుత్వ పెద్దలకు చెప్పినా ఫలితం ఉండటం లేదు. ఇవే విషయాన్ని చెప్పి.. చెప్పి తమకు ఆయాసం వస్తుందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు.ఇటు సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులు తమ తమ ఇళ్లల్లో హ్యాపీగా గడపడానికి వెళ్లినా వర్షాలతో ఎంజాయ్ చేయకుండా పోయిందని అటు విద్యార్థులు కూడా నిరాశ చెందుతున్నారు.

మరో వైపు ఉత్తరభారతాన్ని మంచుదుప్పటి కమ్మేసింది. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాష్ట్రాల్లో భారీ హిమపాతం నమోదు అయింది. అక్కడి మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి వాతావరణం ఉంది. చలిగాలులు వీయడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆస్తమా ఉన్నవారు అయితే ఇంటి నుంచి బయటకు రావడం లేదు. చలిగాలుల తర్వాత కాసేపు ఎండ వచ్చిన జనం సంతోష పడుతున్నారు. కానీ ఆ వెంటనే మబ్బులు వచ్చి.. చల్లని వాతావరణం ఉంది. దీంతో ఊసురుమనడం వారి వంతవుతుంది.

English summary
today morning heavy rain lashes at hyderabad city. some people are face problems while going to office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X