హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోదరీకి బదులు 100కు ఫోన్ చేసి ఉంటే బాగుండేది..హోంమంత్రి

|
Google Oneindia TeluguNews

దారుణ అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి తన సోదరీకి బదులుగా పోలీసుల రక్షణ కోసం 100కు డయల్ చేసి ఉండాల్సిందని తెలంగాణ హోంమంత్రి మహ్మమూద్ ఆలీ అన్నారు. సంఘటన స్థలం నుండి 100కు కాల్ చేసి ఉంటే ఇలాంటీ దారుణ సంఘటన జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు. ఒకవేళ అలా జరిగి ఉంటూ మూడు నిమిషాల్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే వారని చెప్పారు. ఉన్నత విద్యను చదువుకున్న ప్రియాంక రెడ్డి ఇలాంటీ పొరపాటు చేయడం విచారించదగ్గ విషయమని హోంమంత్రి అన్నారు.

లవర్‌తో లేచిపోవచ్చు..: ఫిర్యాదు చేస్తే పోలీసుల స్పందన ఇదంటూ ప్రియాంక రెడ్డి తల్లి కన్నీరులవర్‌తో లేచిపోవచ్చు..: ఫిర్యాదు చేస్తే పోలీసుల స్పందన ఇదంటూ ప్రియాంక రెడ్డి తల్లి కన్నీరు

ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి

గురువారం దారుణ అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి ఇంటికి తెలంగాణ రాష్ట్ర హొంమంత్రి మహమూద్ ఆలీ వెళ్లారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి తన సానుభూతిని వ్యక్తం చేశారు. సత్వర న్యాయం జరుగుతుందని ప్రియాంక కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. నిందితులకు శిక్షలు పడేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. నిందితులనుండి సమాచారం రాబట్టుతున్నారని, విచారణ పూర్తి అవుతుందని ఆయన చెప్పారు.

ప్రియాంక తన కూతురు లాంటిది

ప్రియాంక తన కూతురు లాంటిది

అనంతరం బయటకు వచ్చిన మహ్మద్ ఆలీ మీడియాతో మాట్లాడారు. హత్యకు గురైన ప్రియాంకా రెడ్డి తనకు కూతురు లాంటిదని పెర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. వరంగల్‌లో చిన్నారీపై జరిగిన సంఘటన నేపథ్యంలోనే నిందితునికి రెండు నెలల్లోనే ఉరిశిక్ష పడేలా చర్యలు చేపట్టామని, ప్రస్తుతం ప్రియాంక రెడ్డి కేసులో అదే తీరుగా ప్రయత్నాలు చేస్తామని అన్నారు.

పోలీసులు సకాలంలో స్పందించారు...

పోలీసులు సకాలంలో స్పందించారు...


ఇక ప్రియాంక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు సరిగా స్పందించలేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు. పోలీసులు సత్వరమే స్పందించారని అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు.. ఈ నేపథ్యంలోనే ఇరవై నాలుగు గంటల్లో నిందితులను అరెస్ట్ చేశామని, వారిని పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. త్వరలో వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

English summary
Telangana Home Minister Mohd Mahmood Ali Shocker On Veterinary doctor Murder,he said if the woman had called the police instead of her sister will not be happend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X