TSPSC AE Paper Leak: ప్రవీణ్‍తో రేణుకకు పరిచయం ఎలా ఏర్పడిందంటే..!
పేరులో తప్పుందని టీఎస్‍పీఎస్సీ కార్యాలయానికి వచ్చిన రేణుక.. ఆ తర్వాతే అసలు కథ మొదలు.
టీఎస్‍పీఎస్సీ(TSPSC) ఏఈ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఏఈ పేపర్ ఒక్కటే లీక్ అయిందా.. మిగతా పేపర్లు కూడా లీకయ్యయా.. అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా ప్రవీణ్ కు రేణుక పరిచయం ఎలా ఏర్పడిందో తాజాగా వెలుగులోకి వచ్చింది. రేణుక 2018లో టీఎస్పీఎస్సీ నిర్వహించి గురుకుల టీచర్ పరీక్ష రాశారు. ఆమె పరీక్ష పాస్ అయి ఉద్యోగం పొందారు. రేణుకకు హిందీ పండిట్ ఉద్యోగం వచ్చిన తర్వాత రికార్డుల్లో ఆమె పేరులో తప్పు వచ్చింది.

తప్పును సరిచేసుకునేందుకు
ఈ తప్పును సరిచేసుకునేందుకు రేణుక హైదరాబాద్ లోని టీఎస్‍పీఎస్సీ కార్యాలయానికి వచ్చింది. ఈ క్రమంలోనే టీఎస్‍పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్ తో పరిచయం ఏర్పడింది. ఆమె తన ఫోన్ నెంబర్ ప్రవీణ్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రవీణ్ ఆమెకు తరుచూ ఫోన్ చేసేవాడని సమాచారం. ఆ తర్వాత వీరు తరుచుగా కలిసేవారు. ఈ క్రమంలోనే రేణుకు అనేకసార్లు టీఎస్‍పీఎస్సీ కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

103 మార్కులు
రేణుక, ఆమె భర్త ఏఈ పేపర్ లీక్ చేయాలని ప్లాన్ చేశారు. రేణుకు ప్రవీణ్ తో తనుకున్న సన్నిహిత సంబంధంతో ముగ్గురు కలిసి ఏఈ పేపర్ లీక్ చేశారు. అయితే ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమ్స్ రాశాడు. అతడికి 103 మార్కులు వచ్చినట్లో సోషల్ మీడియాలో ఓ ఓఎమ్మార్ షీట్ వైరల్ అవుతుండగా అది నిజమేనని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ 103 మార్కులు హైఎయిస్ట్ కాదన్నారు.

అధికారుల నిర్లక్ష్యం
అయితే నిబంధనల ప్రకారం టీఎస్సీపీఎస్సీలో పని చేసే ఏ వ్యక్తి కూడా టీఎస్సీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు రాయకూడదని నిపుణులు చెబుతున్నారు. ప్రవీణ్ కుమార్ గ్రూప్-1 పరీక్ష ఎలా రాశాడని.. టీఎస్సీపీఎస్సీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగిందని విమర్శిస్తున్నారు. ప్రవీణ్ పెన్ డ్రైవ్ ఏఈ పేపర్ తో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ పోస్టుల క్వశ్చన్ పేపర్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications