హైదర్ నగర్‌లో నరబలి, కాలిన యువకుడి మృతదేహం

ఇంకా మూఢ నమ్మకాలు వీడటం లేదు. క్షుద్ర పూజలను కొందరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందుకోసం నరబలులు కూడా చేస్తున్నారు. అమావాస్య వచ్చిందంటే చాలు ఏదో ఒక చోట ఇలా జరుగుతూనే ఉంది. ఇటీవల కేరళలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. ఇప్పుడు హైదరాబాద్ హైదర్ నగర్ వద్ద కూడా అలాంటి ఘటనే జరిగింది. కానీ ఇక్కడ ఓ యువకుడిని నరబలి ఇచ్చారు.

హైదర్ నగర్‌లో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. అదీ కాలిపోయి ఉండటంతో పలు అనుమానాలను లేవనెత్తుతుంది. శ్మశాన వాటిక వద్ద మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి దగ్గరలో క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఇదీ నరబలి అయి ఉంటుందని భావిస్తున్నారు.

human sacrifice at hyderabad hyder nagar

మంగళవారం అమావాస్య కావడం, ఆ రోజున సూర్యగ్రహణం వస్తోంది. దీంతో ఆ యువకుడిని బలి ఇచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యకు గురయిన ఆ యువకుడు ఎవరనే విషయంపై స్పష్టత లేదు. కానీ తమకు మంచి జరగాలని వారు అలా చేసి ఉంటారు. క్షుద్ర పూజలకు సంబంధించిన ఇన్సిడెంట్ ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి.

తమకు మంచి జరగాలని, ఆరోగ్యం బాగుండాలని, ఐశ్వర్యం సిద్దించాలని పూజలు చేస్తుంటారు. అనుమానంతో ఉన్న వారిని.. పూజలు చేసేవారు నమ్మిస్తారు. నిధులు, నిక్షేపాలు దొరుకుతాయని కూడా చెబుతుంటారు. డబ్బులకు ఆశపడి ఇలా చేస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+