• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాకింగ్:తమ్ముడి కూతురిపై పలుమార్లు అత్యాచారం - హైదరాబాద్‌లో దారుణం -నిందితుడు ప్రముఖ డాక్టర్

|

బయటివాళ్ల నుంచే కాదు.. సొంత మనుషుల నుంచి కూడా ఆడపిల్లకు భద్రత కరువైన వైనం మరోసారి వెలుగులోకి వచ్చింది. పెదనాన్న స్థానంలో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన వ్యక్తి.. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటంలో బాగా చదువుకున్నవాళ్లు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్లూ మినహాయింపుకాదని తాజా ఘటనతో మళ్లీ వెల్లడైంది. వివరాల్లోకి వెళితే..

కామోన్మాదంతో కరోనా రోగిపై రేప్ - 108 అంబులెన్స్‌‌లో డ్రైవర్ అకృత్యం - చివరికి ఏమైందంటే..

 పేట్‌బషీరాబాద్ ఏరియాలో..

పేట్‌బషీరాబాద్ ఏరియాలో..

హైదరాబాద్ సిటీలోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ వ్యక్తి దంత వైద్యుడి(డెంటిస్ట్)గా సేవలు అందిస్తున్నాడు. స్థానికంగా అతనికి గొప్ప పేరు కూడా ఉంది. కానీ కూతురు వరసయ్యే యువతి బయటపెట్టాక గానీ అతని అసలు రూపం ప్రపంచానికి తెలియలేదు. డాక్టర్ ఇంటికి సమీపంలోనే అతని తమ్ముడు కూడా కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తమ్ముడి కూతురి(21)పై అఘాయిత్యానికి ఒడిగట్టాడు..

 ఇంటికి వచ్చిన ప్రతిసారి..

ఇంటికి వచ్చిన ప్రతిసారి..

రెండు ఇళ్లూ దగ్గరగా ఉండటంతో పెదనాన్న అనే చొరవతో యువతి తరుచూ డాక్టర్ దగ్గరకు వెళ్లేది. అయితే అతను మాత్రం వంకర బుద్దితో ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఇంటికి రాగా.. బలవంతంగా రూమ్ లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటికి చెబితే చంపేస్తానని బెదిరించి.. పలుమార్లు ఆమెను అనుభవించాడు.

తట్టుకోలేక చివరికి..

తట్టుకోలేక చివరికి..

పెదనాన్ని తనపై సాగిస్తోన్న అఘాయిత్యాన్ని చాలా రోజులపాటు మౌనంగా భరించిన ఆ యువతి తనలో తానే కుమిలిపోయేది. రోజులు గడుస్తున్నకొద్దీ డాక్టర్ పైశాచికత్వం పాళ్లు ఇంకా పెరుగుతుండటంతో ఆమె తట్టుకోలేకపోయింది. చివరికి తన తల్లిదండ్రులకు జరుగుతోన్న విషయాన్ని చెప్పేసింది. తొలుత నిర్ఘాంతపోయిన ఆ తల్లిదండ్రులు.. వెంటనే తేరుకుని షీ టీమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఏమన్నారంటే..

పోలీసులు ఏమన్నారంటే..

పేట్‌బషీరాబాద్ లో సంచలనం రేపిన ఈ సంఘటనపై ఏసీపీ నర్సింహారావు మీడియాకు వివరణ ఇచ్చారు. ఆదివారంనాడు ఓ యువతి నుంచి ఫిర్యాదు అందిందని, ముందుగా ఆమె షీటీమ్స్ ను ఆశ్రయించిందని, డాక్టర్‌గా పని చేస్తున్న తన పెద్దనాన్నే పలు మార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఏసీపీ వివరించారు. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బాధితురాలిని బెదిరించారని, యువతి ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసి డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీని జగన్ అంగీకరించరు - పెడితే నవ్వులపాలే - విపక్ష నేతల విసుర్లు

English summary
a terrible incident came to light in Hyderabad, A doctor who turned into a vampire, repeatedly raped his brother's daughter. The matter came to light after the victim lodged a complaint with the police. incident took place at Pet Basheerabad Police Stationpremises
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X