పెట్టుబడులకు డెస్టినేషన్‌గా హైదరాబాద్: మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిన సంగతి తెలిసిందే. బెంగళూరు, పుణె తర్వాత ఇక్కడే ఎక్కువ కంపెనీలు నెలకొల్పారు. సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇవ్వడంతో.. వారు ఏర్పాటు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ డెస్టినేషన్‌గా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలే ఇందుకు కారణమని చెప్పారు.
ప్రపంచంలోని అతి పెద్ద బహుళజాతి సంస్థలు, ఐటీ సంస్థలు ఇక్కడ విస్తరణ కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఆస్పైర్ పాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను హరీశ్ రావు ప్రారంభించారు. ఫీనిక్స్ టెక్నాలజీస్ ఇక్కడ ఆస్పైర్ సొల్యూషన్స్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని హరీశ్ అన్నారు.

తెలుగు విద్యార్థులకు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషకరం అని చెప్పారు. ఆవిష్కరణల విషయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ వెల్లడించిందని హరీశ్ రావు గుర్తుచేశారు. ఆవిష్కరణల సూచీలో కర్ణాటక, తెలంగాణ తొలి రెండు స్థానాల్లో ఉంటే... గుజరాత్, బీహార్ 14, 15 స్థానాల్లో ఉన్నాయని చెప్పారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సంస్థలకు ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. అందుకోసమే అవీ ముందుకొస్తున్నాయని వివరించారు. యువతకు వృత్తివిద్య కోర్సులు, ఉపాధి కల్పించడంపై తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని హరీశ్ వివరించారు.












Click it and Unblock the Notifications