నేటి నుంచే అందుబాటులోకి హైదరాబాద్ హెటిరో ‘ఫావివిర్’ ఔషధం
న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాధి చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ఔషధాన్ని భారత్‌లో విక్రయించేందుకు హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్‌కు అనుమతి లభించిన నేపథ్యంలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ. రెమిడెసివిర్‌కు జనరిక్ రూపమైన ఫావిపిరావిర్‌ను కరోనావైరస్ వ్యాధి ప్రాథమిక, మధ్యస్థ దశలో ఉన్నప్పుడు వాడతారు.
Recommended Video
తాజా ఔషధం ఫావివిర్ నోటి ద్వారా తీసుకునే మాత్రం రూపంలో బుధవారం నుంచి దేశ వ్యాప్తంగా మందుల దుకాణాలు, ఫార్మసీల్లో లభ్యమవుతుందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, దీనిని వైద్యుల ప్రిస్కిప్షన్ మేరకు మాత్రమే అందజేస్తామని, ఒక టాబ్లెట్ ధరను రూ. 59గా సంస్థ నిర్ణయించింది.

ప్రపంచంలో కరోనా కేసుల నమోదులో మూడో స్థానంలో కొనసాగుతున్న మనదేశంలో ఈ ఔషధానికి విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఫావిపిరావి తయారీ, పంపిణీ చేసేందుకు తమకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించిందని హెటిరో వెల్లడించింది.
హైదరాబాద్ నగరానికి చెందిన హెటిరో సంస్థ కోవిఫర్ పేరుతో ఇది వరకే రెమిడెసివిర్ ఔషధాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫావిపిరావిర్ ను భారతదేశంలో ఫావివిర్ బ్రాండ్ పేరుతో ఔషధాన్ని విడుదల చేస్తోంది. అంతర్జాతీయ వైద్య ప్రమాణాలకు అనుగుణంగా తాము ఈ ఔషధాన్ని తయారు చేస్తామని సంస్థ తెలిపింది.
హెటిరో హెల్త్‌కేర్ లిమిటెడ్ ద్వారా ఫావివిర్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. జులై 29 నుంచి అన్ని మెడికల్ షాపులలో, ఆస్పత్రుల్లో ఈ ఔషధాన్ని అందుబాటులో ఉంచుతామని హెటిరో తెలిపింది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications