Hydra: స్పీడ్ పెంచిన హైడ్రా.. దుండిగల్ లో విల్లాల కూల్చివేత..

హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. అక్రమార్కులకు వణుకు పుట్టిస్తోంది. అక్రమార్కుల నుంచి చెరువులను కాపాడుతోంది. ఇప్పటికే చాలా వరకు అక్రమా నిర్మాణాలను కూల్చివేసింది. అక్రమార్కులు ఎవరు అనేది లెక్క చేయకుండా ముందుకెళ్తోంది. ఇప్పటికే దాదాపు 18 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి రక్షించింది. సినీ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసింది. తుమ్మిడికుంట చెరువు కబ్జా చేసి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చి వేశారు.

ఇక ప్రముఖ రియాల్ ఎస్టేట్ సంస్థ జయభేరికి కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగళాల్ కుంట చెరువు ఎఫ్ టి ఎల్ మరియు బఫర్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని నోటీసులు ఇచ్చింది. తాజాగా దుండిగల్ మున్సిపల్ పరిధిలో మల్లంపేట కత్వ చెరువు FTL స్థలంలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు హైడ్రా సిద్ధమైంది. హైడ్రా అధికారులు ఆదివారం (సెప్టెంబర్ 8న) ఉదయం అక్కడికి చేరుకున్నారు.

Hydra is demolishing the structures built in the buffer zone in Dundigal

అక్రమంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ (విజయలక్ష్మి) విల్లాల కూల్చడానికి మిషనరీతోపాటు పోలీసుల బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు. మాదాపూర్ లోని సున్నపు చెరువులో 43 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సున్నపు చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింగి. అలాగే బాచుపల్లి బొరంపేట చెరువు పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు.

భవిష్యత్ లో ఇంకా హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే హైడ్రాకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో అక్రమార్కులు చెరువులు కబ్జా చేసి నిర్మాణాలను కూల్చివేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+