ధనిక రాష్ట్రం అయితే ఇన్నీ రేషన్ కార్డులా.. విజయశాంతి విసుర్లు

తెలంగాణ ప్రభుత్వంపై రాములమ్మ విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. మనది ధనిక రాష్ట్రం అని రాష్ట్ర సర్కార్ గొప్పలు చెప్పుతుందని.. మరో వైపు రాష్ట్రంలో పేదల సంఖ్య నానాటికీ ఎలా పెరిగిపోతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. జీఎస్‌‌డీపీలో దేశంలో రాష్ట్రం 5వ స్థానంలో ఉందని, సర్​ప్లస్‌‌ స్టేట్‌‌ అని ఆర్థిక శాఖ చెప్పే లెక్కలకు, సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ జారీ చేసే రేషన్‌‌ కార్డులకు పొంతన లేదని విమర్శించారు. గురువారం అసెంబ్లీ సమావేశంలో టీఆర్ఎస్ సర్కార్ రేషన్‌‌ కార్డుల వివరాలు ప్రకటించడం చూస్తుంటే రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో పేదల సంఖ్య ఎక్కువయిందని స్పష్టమవుతుందని అన్నారు.

అంతమందికి ఎలా..?

అంతమందికి ఎలా..?

రాష్ట్ర జనాభా దాదాపు 4 కోట్ల వరకు ఉండగా.. చట్ట ప్రకారం బీపీఎల్ ​స్థాయికి దిగువలో ఉన్న కుటుంబాలకు మాత్రమే రేషన్‌‌ కార్డులు ఇస్తారు.గ్రామాల్లో అయితే లక్షన్నరలోపు సంవత్సర ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 2 లక్షలలోపు సంవత్సరాదాయం ఉన్న కుటుంబాలు రేషన్‌‌ కార్డులకు అర్హులు. 2 కోట్ల 87 లక్షల 68 వేల మంది రేషన్‌‌ లబ్ధిదారులు ఉన్నట్లు సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ప్రకటించింది. రేషన్ కార్డులు ఉన్న 90.49 లక్షల కుటుంబాలు పేదవర్గాలే అంటే.. రాష్ట్ర జనాభాలో 71 శాతం పైగా ఏడేళ్లలో 21.30 లక్షల మంది పేదరికంలోకి కూరుకుపోయారని రేషన్‌‌ కార్డుల లెక్కలు చూస్తేనే తేటతెల్లం అవుతుందని విజయశాంతి విమర్శించారు.

గారడీ మాటలు ఆపండి

రాష్ట్రం ఆదాయంలో ధనిక రాష్ట్రమని,, దేశ అభివృద్ధికి నిధులు ఇస్తున్న రాష్ట్రంలో మన రాష్ట్రం ఒకటని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో గారడీ మాటలు చెప్పడం సిగ్గుచేటన్నారు. అసలు రాష్ట్రంలో 71 శాతానికి పైగా పేద ప్రజలు తెల్ల రేషన్ కార్డులు ద్వారా జీవిస్తుంటే ధనిక రాష్ట్రం ఎలా అయ్యిందో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలని కోరారు. ధనిక తెలంగాణ అప్పుల లెక్క అప్పట్లో 70 వేల కోట్లు నుంచి ఇప్పడు నాలుగు లక్షల కోట్లు దాటిందని వివరించారు. 5 నెలల్లో 6800 కోట్ల వడ్డీ కడుతుందంటే ఏ తీరుగా అప్పులు తెస్తుందో, ఏ తీరుగా ప్రజల వద్ద దోచుకుని మిత్తీలు కడుతుందో తెలుసుకోవాలని కోరారు.

1.05 లక్షల అప్పు

1.05 లక్షల అప్పు


రాష్ట్రంలో ప్రజలందరిపై ప్రభుత్వం మోపే అప్పు ఒక్కొక్కరిపై లక్ష 5వేల పైనే ఉందని విజయశాంతి వివరించారు. ధనిక రాష్ట్రం అంటూనే ప్రజలను దారిద్య రేఖకు దిగువన పడేస్తున్న రాష్ట్ర సర్కార్ పేద ప్రజల ప్రగతికి చేస్తుంది శూన్యం అని గమనించాలని కోరారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ నియంత పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలని కోరారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపిస్తోన్న బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేలా ప్రజలు సంకల్పించాలని రాములమ్మ పిలుపునిచ్చారు.

కబుర్లు చెబుతూ..

కబుర్లు చెబుతూ..


రాష్ట్రం ప్రభుత్వం చెప్పేదీ ఒకటి చేసేదీ ఒకటి అని విజయశాంతి మండిపడ్డారు. ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అప్పులు చేస్తూనే.. సంపద సృష్టిస్తున్నామని కబుర్లు చెబుతున్నారని వివరించారు. ఇటు పేదలు మరింత పేదలుగా మారుతూనే ఉన్నారని ధ్వజమెత్తారు. లక్షల కోట్ల బడ్జెట్.. ప్రజాధనం ఎక్కడికీ వెళుతుందని ఆమె అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+