ఉప్పల్ మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి ఏం జరిగింది: తేలు కుట్టిన దొంగ..హెచ్‌సీఏ!!

హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 ఇంటర్నేషనల్ ముగిసింది. ఆస్ట్రేలియన్లను రోహిత్ సేన మట్టి కరిపించింది. సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. హైదరాబాద్ గడ్డ మీద టీమిండియా ఘనవిజయం సాధించడం అభిమానుల్లో జోష్ నింపింది. సిరీస్ డిసైడర్ కావడం, 2019 తరువాత తొలిసారిగా ఉప్పల్ స్టేడియంలో టీ20 ఇంటర్నేషనల్‌ను షెడ్యూల్ చేయడం వల్ల దీనికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

తొక్కిసలాట..

తొక్కిసలాట..

తమ ఆరాధ్య క్రికెటర్లను ప్రత్యక్షంగా చూడ్డానికి వేలాదిమంది అభిమానులు ఎగబడ్డారు. ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ ఉంటుందని ముందే తెలిసినప్పటికీ- సజావుగా టికెట్లను విక్రయించడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దారుణంగా విఫలమైంది. టికెట్లను కొనడానికి వెళ్లిన అభిమానులు ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు.. ఆసుపత్రిపాలయ్యారు.

మ్యాచ్ నిర్వహణలోనూ..

మ్యాచ్ నిర్వహణలోనూ..

ఇదంతా ఒక ఎత్తయితే- మ్యాచ్ నిర్వహణ విషయంలోనూ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. అడుగడుగునా వైఫల్యాలు అభిమానులను వెంటాడాయి. వేల రూపాయలను ధారపోసి టికెట్లను తీసుకుని స్టేడియానికి వెళ్లిన అభిమానులు మ్యాచ్‌ను కనీసస్థాయిలో కూడా ఎంజాయ్ చేయలేకపోయారు. కూర్చోవడానికి కుర్చీలు లేని పరిస్థితులను ఎదుర్కొన్నారు. కనీసం నిల్చొని మ్యాచ్ చూడటానికీ కాసింత స్థలం లేని దుస్థితిని చవి చూశారు.

టికెట్లపై నంబర్లేవీ..

టికెట్లపై నంబర్లేవీ..

జింఖానా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్లల్లో కొన్న మెజారిటీ టికెట్ల మీద సీట్ నంబర్‌ను ఇవ్వలేదు హెచ్‌సీఏ. స్టేడియంలో కనిపించిన కుర్చీల్లో కూర్చున్నా.. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్లకు రిజర్వ్ అయ్యాయవి. ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకున్న వారి కోసం సీట్లను ఖాళీ చేయాల్సి వచ్చిన అభిమానులు చాలామందే ఉన్నారు. టికెట్ కొన్న నేరానికి అవస్థలు పడుతూ నిల్చోని మరీ మ్యాచ్‌ను తిలకించారు వారంతా.

కాంట్రాక్టర్‌తో కుమ్మక్కు..

కాంట్రాక్టర్‌తో కుమ్మక్కు..

ఈ వైఫల్యాలన్నింటికీ హెచ్‌సీఏ బాధ్యత వహించాల్సి ఉంటుందనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంటోంది. మ్యాచ్ ముగిసిపోయి 48 గంటలవుతున్నప్పటికీ తప్పు ఎక్కడ చోటు చేసుకుందనే విషయంపై హెచ్‌సీఏ స్పష్టత ఇవ్వట్లేదు. వైఫల్యాల గురించి ఒక్కమాట కూడా మాట్లాడట్లేదు. ఈ పరిణామాలు హెచ్‌సీఏ పనితీరుపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను విక్రయించడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్న పేటీఎం ఇన్‌సైడర్‌‌తో కుమ్మక్కయిందనే ఆరోపణలు నిజం అయినట్టే భావించాల్సి ఉంటుందని అంటున్నారు ఫ్యాన్స్.

 మ్యాచ్‌కు ముందురోజు..

మ్యాచ్‌కు ముందురోజు..

ఈ పరిణామాలన్నీ హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్‌కు ప్రతికూలంగా మారాయి. మ్యాచ్‌కు ముందురోజు హెచ్‌సీఏ సభ్యులకు ఆయన మందు పార్టీ ఇవ్వడాన్ని ఎత్తి చూపుతున్నారు అభిమానులు. ఈ పార్టీ కోసం 30 లక్షల రూపాయలను అజరుద్దీన్ ఖర్చు చేశారని, ఈ సొమ్ము ఎక్కడిదని నిలదీస్తోన్నారు. మరోసారి హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికే ఆయన ఈ పార్టీ వ్యవహారాన్ని నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+