హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్యూటీ రీలీఫ్ తొలగించడం చిల్లర చర్య..అశ్వత్థామ రెడ్డి

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ యూనియన్ నాయకులపై ఆగ్రహంగా ఉన్న సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే యూనియన్ నాయకులకు ఉన్న డ్యూటీ రిలీఫ్‌ను తొలగించారు. అయితే యూనియన్ల అణచివేతకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై యూనియన్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇది చిల్లర చర్యగా ఆర్టీసీ ఐకాస నేత అశ్వత్థామ రెడ్డి అభివర్ణించారు. యూనియన్లు ఉండాలా వద్దా అనే అంశంపై రెఫరెండం నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్...ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్...

యూనియన్ నాయకులు మినహాయింపులు ఉన్నాయి

యూనియన్ నాయకులు మినహాయింపులు ఉన్నాయి

ఆర్టీసీ సమ్మె ముగిసింది. కార్మికులు విధుల్లోకి వచ్చారు. దీంతో అన్ని డిపోల వద్ద సందడి నెలకొంది. ఎవరి డ్యూటీలకు వారు వెళుతున్నారు. కాని సీఎం కేసీఆర్ నిర్ణయం కార్మికులకు అనుకూలంగానే ఉన్నా... ఇన్నాళ్లు తమ ఆదేశాలతో కొనసాగించిన నాయకులు మాత్రం ఆందోళనలో కనిపిస్తున్నారు. నాయకులను డ్యూటీ రీలీఫ్ తొలగించడం చిల్లర చర్యగా ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వాత్థామ రెడ్డి ఆరోపించారు. చట్టప్రకారమే కార్మికులకు కొన్ని మినహాయింపులు ఉంటాయని అన్నారు.

యూనియన్లు, హక్కుల కోసం కాదు

యూనియన్లు, హక్కుల కోసం కాదు


యూనియన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలోనే యూనియన్లు ఉండాలా వద్దా... అనే దానిపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక యూనియన్లు ఉన్నవి కేవలం హక్కుల కోసమే యూనియన్లు లేవని..అవసరమైతే యూనియన్లు నేతలంతా విధుల్లోకి వెళతామని అన్నారు. ఇక యూనియన్లను రద్దు చేసే హక్కు ఎవరికి లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో యూనియన్లు కీలకంగా పని చేశాయని అయన చెప్పారు. ఇక యూనియన్ల వల్లే నష్టం వస్తుందని భావిస్తే... దాన్ని సరిదిద్దుకుంటామని అన్నారు. ఇక యూనియన్లు ఉండాలా లేదా అనేది కోర్టు తేలుస్తుందని అన్నారు.

మజ్దూర్ కార్యాలయానికి తాళం

మజ్దూర్ కార్యాలయానికి తాళం

కాగా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం నేరుగా కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. యూనియన్లు లేకుండా సమస్యలపై చర్చించేందుకు సన్నద్దమయ్యారు. మరోవైపు యూనియన్ కార్యాలయాలకు కూడ తాళాలు వేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్టీసీ సమ్మెను చేపట్టిన తర్వాత ముఖ్యంగా కార్మిక సంఘాలు, సంఘాల నాయకులు మాత్రం కొంత ఇబ్బంది కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

English summary
ashwathama reddy fires on c.m kcr removal of duty relief for union leaders. its cheapest action he described.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X