Pushpa2: అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట.. రేవతి భర్త..!
పుష్ప2 మూవీ ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన ఓ మహిళ తొక్కిసలాటలో మృతి చెందిన విషయం తెలిసిందే. దిల్షుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్ , ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప2 ప్రీమియర్ షో చూడటానికి డిసెంబర్ 4న ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mm కు వచ్చారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వెళ్లారు. దీంతో అక్కడ జరిగిన తొక్కిసలాట రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
పోలీసులు వారిని విద్య నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటిచారు. బాలుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా మారడంతో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై మృతురాలి భర్త మీడియాతో మాట్లాడారు. తమ బాబు శ్రీ తేజ అల్లు అర్జున్ కు పెద్ద ఫ్యాన్ చెప్పారు. చుట్టు పక్కల వారు తమ బాబును పుష్ప అని పిలుస్తారని గుర్తు చేశారు. తన హీరో సినిమా చూడాలని తమ కుమారుడు పట్టుబట్టినట్లు తెలిపారు. దీంతో తమ కుమారుడి కోసమే పుష్ప2 సినిమా ప్రీమియర్ షోకు వచ్చినట్లు వివరించారు.

తన భార్య ను కోల్పోవడం తట్టుకోలేక పోతున్నానని కన్నీరుమున్నీరు అయ్యారు. షో మొదలవ్వడానికి ముందే తన భార్య పిల్లలు థియేటర్ లోపలికి వెళ్లారని భాస్కర్ చెప్పారు. అప్పటికి అభిమానులు తాకిడి మామూలుగానే ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా జనాలు పెరిగిపోయారని.. అందరు లోపలికి రావడానికి ప్రయత్నించగా.. తొక్కిసలాట జరిగినట్లు వివరించారు. తొక్కిసలాటలో తన భార్య, కుమారుడు కింద పడిపోయినట్లు తెలిపారు. వారు స్పృహా కోల్పోవడంతో పోలీసులు తన భార్య, కుమారుడికి సీపీఆర్ చేశారని వివరించారు.
పోలీసులు సీపీఆర్ చేసినపుడు శ్రీతేజ స్పృహలోకి రావడంతోనే అస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నాడు. తన భార్య మాత్రం ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూసిందని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. భాస్కర్ కుటుంబానికి న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. ఇక ఘటనపై అల్లు అర్జున్ ఇప్పటి వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications