జూబ్లీహిల్స్ రేప్ కేసు: నిందితులను గుర్తించిన బాధితురాలు, న్యాయమూర్తికి వెల్లడి
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కేసులో నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రేప్ చేసిన నిందితులను బాధితురాలు గుర్తుపట్టారు. వీరిలో మేజర్ అయిన సాదుద్దీన్ చంచల్‌గూడ జైల్లో ఉండగా.. మిగిలిన ఐదుగురు మైనర్లు జువెనైల్ హోంలో ఉన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులు వీరేనని బాధితురాలు పోలీసులు, న్యాయమూర్తికి తెలిపారు.

నిందితుల గుర్తింపు
నిందితుల గుర్తింపు ప్రక్రియను సోమవారం పోలీసులు చేపట్టారు. చంచల్‌గూడ జైలుతో పాటు జువెనైల్ హోంకు వెళ్లిన బాధితురాలు న్యాయమూర్తి సమక్షంలోనే నిందితులను గుర్తించింది. న్యాయమూర్తి అడిగిన పలు ప్రశ్నలకు బాధితురాలు వివరంగా సమాధానం ఇచ్చారు. వివరాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ అమ్నేషియా పబ్ పరిసరాల్లో గ్యాంగ్ రేప్ తీవ్ర కలకలం రేపింది.

గాయాలు..
బాధితురాలి బాలిక శరీరంపై 12 గాయాలు ఉన్నాయని. దీనిపై నిందితులను పోలీసులు ఆరా తీశారు. బాలిక మెడపై తీవ్రంగా కొరకడం, రక్కడంతో గాయాలు అయ్యాయి. బాలిక మెడపై టాటూలా ఉండాలనే, మెడపై కొరికినట్లు నిందితులు తెలుపడం విశేషం. పబ్‌లో బాలికను పరిచయం చేసుకునప్పటి నుండి ట్రాప్‌లోకి దించడం, అత్యాచార ఘటన, మరుసటి రెండు రోజుల వరకు ఏం జరిగింది, ఎక్కడికి పరార్ అయ్యారు, ఎవరి సహాయంతో రాష్ట్రం దాటారు.. ఇలా అనేక కోణాల్లో విచారించారు.

మైనర్లా..?
చూడటానికే మైనర్లు.. కానీ వారిలో విశృంఖల మనస్తత్వం.. బాలికపై లైంగకదాడి చేయడమే కాదు.. మెడపై కొరికి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. మెడపై కొరడకం, ఇతర చోట్ల రక్కి.. రాక్షస ఆనందం పొందారు. అందుకే ఆ బాలిక అంతలా భయపడింది. జరిగిన ఘటన గురించి పేరంట్స్‌కు చెప్పలేకపోయింది. వైద్యుల వద్ద కూడా నోరు మెదపలేదు.
కానీ కౌన్సిలింగ్ ఇస్తే.. నోరు తెరిచింది. జరిగిన దారుణం గురించి తెలియజేసింది. ఇలా ఆ ఆరుగురి ఉన్మాద చర్య బయట పడింది. గెట్ టు గెదర్ అని పార్టీకి వెళితే.. దారుణంగా లైంగికదాడికి గురయ్యింది. ఆ వివరాలను న్యాయమూర్తి, పోలీసులకు తెలియజేసింది.












Click it and Unblock the Notifications