జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం లేనట్టే.. ముగియనున్న ఎలక్షన్ క్యాంపెయిన్
Recommended Video

Telangana elections 2018 : జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం లేనట్టే ! | Oneindia Telugu
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బుధవారంతో తెరపడనుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే అంశం మొదటినుంచి వైరల్ అయింది. దివంగత నటుడు, టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్ పల్లి సెగ్మెంట్ నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు.

సుహాసిని సోదరి కావడంతో ఆమెకు ప్రచారం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వస్తారని తొలుత భావించారు. కానీ వీరిద్దరు ప్రచారానికి రానట్టే లెక్క. బుధవారం నాటితో ఎన్నికల ప్రచార పర్వం ముగియనుండటంతో వీరిద్దరు క్యాంపెయిన్ నిర్వహించే వీలులేదు. అయితే సినిమా షూటింగులతో బిజీగా ఉండటమే కారణంగా చెబుతున్నారు టీడీపీ శ్రేణులు. అంతేగానీ వేరే ఏ ఇతర కారణాలు లేవని అంటున్నారు.












Click it and Unblock the Notifications