బట్టతలను దాచిపెట్టీ.. అందగాడీగా కలరింగ్..20 మందిని ఛీట్ చేసిన మాయగాడు
మోసం చేయడమే నైజం.. ఛీట్ చేసి కాలం వెళ్లదీసే వాడు. అమ్మాయిలకు వల వేసి.. కుచ్చుటోపీ పెడతాడు. ఎన్నారై మాదిరిగా కలరింగ్ ఇచ్చి మాయమాటలు చెబుతాడు. చాలా మంది అమ్మాయిలు వలలో పడి మోసపోయారు. అతని పేరు కార్తీక్ వర్మ కాగా.. మోసం చేసిన అమ్మాయిల లిస్ట్ చాలానే ఉంది. ఒకరి తరువాత ఒకరిని మోసం చేయటమే పనిగా పెట్టుకున్నాడు. వారితో సహజీవనం చేస్తాడు. అతని వలలో పడ్డ ఓ అమ్మాయి వాడి బండారాన్ని బట్టబయలు చేసింది.

సెల్‌లో మోసగాడు
మోసగాడిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి సెల్‌లో వేశారు. బట్టతల అంశాన్ని దాచిపెట్టి ఎన్నారై అని మాయ మాటలు చెప్పి.. ఆంధ్రా తెలంగాణల్లో 20 మంది అమ్మాయిలను మోసం చేశాడు. బట్టతలను కవర్ చేసి విగ్గూ పెట్టుకొన్ని మోసాలకు పాల్పడుతున్న కార్తీక్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఎన్‌ఆర్‌ఐ అంటూ...మహిళలను ట్రాప్ చేసేవాడు. పెళ్లి కాలేదని చెప్పి విగ్గుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేవాడు. అందంగా ఉండే కార్తీక్ వర్మ ఫోటోలు చూసి అమ్మాయిలు వలలో పడుతున్నారు.

20 మంది అమ్మాయిలను ఛీట్
ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను కార్తీక్ వర్మ మోసం చేశాడు. అమ్మాయిలతో పరిచయం పెంచుకొని కొన్నాళ్లపాటు సహజీవనం చేశాడు. వ్యక్తిగత సమయంలో తీసిన ఫోటోలను చూపి బ్లాక్ మెయిల్ చేసేవాడు. బాధిత అమ్మాయిలు బయటకు చెప్పుకోలేని వారు అతను అడగిన డబ్బులు, బంగారం ఇచ్చుకుంటారు. అలా కార్తీక్ వర్మ ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను మోసం చేశాడు. అలా మోసం చేస్తుండగా అతని పాపం పండింది. ఓ మహిళ అతని మోసాన్ని బహిర్గతం చేసింది.

ఇలా దొరికాడు
కూకట్ పల్లిలో ఓ అమ్మాయిని మోసం చేసి డబ్బులు లాగేసుకున్నాడు. ఆ యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. కార్తీక్ వర్మ ను అరెస్ట్ చేశారు. కార్తీక్ వర్మపై పీడీ యాక్ట్ పెట్టారు. అతని గాడి గురించి విచారణ చేయగా అతని వలలో పడి 2 0మంది అమ్మాయిలు మోసపోయారని తేలింది. మోస పోయేవాళ్లు ఉన్నంత వరకు మోసం చేసే వారు ఉంటారు.. తప్పు మనదే అనే సామెతను గుర్తుచేశారు. కార్తీక్ ఎలాగూ మోసగాడే.. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలని చెప్పేవారు కూడా ఉన్నారు.