హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరామర్శల పరంపర: రేవంత్ తర్వాత కోమటిరెడ్డి, వీహెచ్‌కు పరామర్శ, ప్రాధాన్యం

|
Google Oneindia TeluguNews

అదెందో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించిన తర్వాతే.. సీనియర్ నేత వీ హనుమంతరావు అనారోగ్యబారిన పడ్డారు. కిడ్నీ సమస్యతో ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవీ ఇవ్వొద్దని చెప్పినవారిలో వీహెచ్ ముందు ఉంటారు. అయితే రేవంత్‌కు పగ్గాలు అప్పగించిన తర్వాత ఆస్పత్రిలో ఉన్న వీహెచ్‌ను పరామర్శించారు. అంతకుముందు, తర్వాత కూడా నేతలు కలిశారు. కానీ రేవంత్ కలువడం చర్చనీయాంశంగా మారింది. తనలో ఎలాంటి భేషజాలు లేవని.. అందరినీ కలుపుకొని పోతానని సంకేతాలు ఇచ్చారు.

Recommended Video

Revanth Reddy As TPCC President: Chandrababu Role ? | Oneindia Telugu
ఆస్పత్రిలో వీహెచ్..

ఆస్పత్రిలో వీహెచ్..


తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కిడ్నీ సమస్యతో బాధపడుతూ హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయనను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. అపోలో ఆసుపత్రికి వెళ్లి వీహెచ్‌తో కాసేపు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

కోమటిరెడ్డి పరామర్శ..

కోమటిరెడ్డి పరామర్శ..


వీహెచ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తాను అపోలో ఆసుపత్రికి వెళ్లినప్పటి ఫొటోలను కూడా కోమటిరెడ్డి పంచుకున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో వీహెచ్ ముందువరుసలో ఉంటారు. రేవంత్‌కు పీసీసీ పదవి ఇచ్చిన వెంటనే వీహెచ్ ఆసుపత్రిలో చేరారు. మరోవైపు, కోమటిరెడ్డి కూడా తనకు పీసీసీ రాకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. కానీ కాస్త మెత్తబడ్డారు. రాజకీయాలు మాట్లాడబోనని ప్రకటించారు. కానీ వీహెచ్‌ను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదీ కూడా రేవంత్ కలిసిన తర్వాత మీట్ కావడం.. ఉత్కంఠ రేపుతోంది.

హాట్ కామెంట్స్.. తర్వాత తగ్గి

హాట్ కామెంట్స్.. తర్వాత తగ్గి

టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. టీపీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేయడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. గాంధీ భవన్ కు రానని, ఓటుకు నోటు విధానం ద్వారా టీపీసీసీ ఎంపిక ప్రక్రియ జరిగిందని హాట్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ, టీటీడీపీ గా మారిపోయిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతలు స్పందించలేదు. కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ అయ్యింది. దీంతో కోమటిరెడ్డి దారిలోకి వచ్చారు. ఇక రాజకీయాలు మాట్లాడను అంటూ స్పష్టంచేశారు.

English summary
congress senior leader komatireddy venkat reddy meets v hanumantha rao at apollo hospital in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X