ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య: నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారి అత్యాచారం హత్య ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారి లైంగిక వేధింపులు, హత్య వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని మంత్రి తెలిపారు.
ఈ ఘటన చాలా బాధాకరమన్న కేటీఆర్.. నేరస్తుడిని గంటల వ్యవధిలో అరెస్టు చేశారని తెలిపారు. అయితే, చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చుడాలని హోంమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీకి కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.

కాగా, గురువారం హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ దారుణం జరిగిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల పాపపై ఓ కామాంధుడు అకృత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని రేప్ చేసి దారుణంగా చంపేశాడు. స్థానికంగా ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాగా, సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే రాజుపై స్థానికులకు అనుమానం వచ్చింది.
యాదాద్రిభువనగిరి జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు రాజు. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో రాజు దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా అతని గదిలో ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ అలా ఓ కిరాతకుడికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబసభ్యులు, స్థానికులు కూడా కంటతడపెట్టారు.
Deeply anguished with the news of a 6 year old child’s sexual molestation & murder in Singareni colony
— KTR (@KTRTRS) September 12, 2021
While the perpetrator has been arrested within hours, I request Home Minister @mahmoodalitrs Garu & @TelanganaDGP Garu to ensure that justice is delivered expeditiously 🙏
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరించారు. అయితే నిందితుడు రాజును తమకు అప్పగించే వరకూ పాప మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేది లేదని బస్తీవాసులంతా నిరసనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. కాగా, నిందితుడు రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ మందుకు బానిసై భార్యను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడని తెలిసింది.
కాగా, బాలిక మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అత్యాచారం చేసి గొంతునులిమి చిన్నారిని హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులుకు అప్పగించారు.
నిందితుడు రాజు గురువారం సాయంత్రం బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని పరుపులో మూటకట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు, స్థానికులు బాలిక కోసం వెతకగా.. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చి రాజు ఇంటిని పరిశీలించగా బాలిక శవమై కనిపించింది. అనంతరం బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్యచేసిన రాజును కాల్చి చంపాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
మరోవైపు ఆందోళనకారుల వద్దకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, డీసీపీ రమేశ్ రెడ్డి వచ్చి మాట్లాడారు. ప్రభుత్వం తరపున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని, డబుల్ బెడ్ రూం ఇల్లు, పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని బాధిత కుటుంబానికి కలెక్టర్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబంలోని మరో ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా నిందితుడికి జైలు శిక్ష పడేలా చేస్తామన్నారు.
Recommended Video
ఈ ఘటన జరగడం దురదృష్టమని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి అన్నారు. పాప డెడ్ బాడీ తరలించే టైంలో పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. పాప డెడ్ బాడీకి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం జరుగుతోందని తెలిపారు. మరో రెండు గంటల్లో నిందితున్ని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితునికి తొందరగా శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. మరోవైపు చిన్నారి ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications