LB నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు: KTR

ఎల్బీనగర్‌ జంక్షన్ లో కూడలిలో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌వైపు వెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం రూ.32 కోట్లతో ఫ్లై ఓవర్‌ నిర్మించింది. తాజాగా మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. రెండో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో.. ఎల్బీనగర్‌ జంక్షన్ సిగ్నల్‌ ఫ్రీగా మారింది. ఓ ఫ్లైఓవర్‌, 2 అండర్‌పాస్‌లు గతంలోనే అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన 35వ ప్రాజెక్టును ప్రారంభించామని, మరో 12 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోనే 12 పనులు చేపట్టామని, ఇప్పటికే 9 ప్రాజెక్టులు పూర్తికాగా.. మిగతా 3 ఫ్లై ఓవర్లను సెప్టెంబరు లోపు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. మెట్రోను దిల్‌సుఖ్‌నగర్‌ లైన్‌తో అనుసంధానం చేస్తాంమని, ఎన్నికల తర్వాత మెట్రోను హయత్‌నగర్‌ వరకు విస్తరిస్తామన్నారు. ఎల్బీనగర్‌ మెట్రో మార్గాన్ని విమానాశ్రయంతో అనుసంధానించబోతున్నట్లు తెలిపారు. ఏడాదిన్నరలోపే కొత్తపేట మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేస్తామని, జీవో 58, 59 కింద ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను క్రమబద్ధీకరిస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఎల్బీనగర్‌ జంక్షన్ కు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి పేరు పెడతామని, ఈ మేరకు త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.

LB Nagar junction Name Srikantachari: KTR

తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం దమనకాండ, అరెస్టులకు పాల్పడటాన్ని చూసిన శ్రీకాంతాచారి తట్టుకోలేకపోయాడు. ఆ ఉద్వేగంతో, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో 2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కేసీఆర్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ దీనికి పాల్పడ్డాడు. కాలిన గాయాలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3 రాత్రి 10.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచాడు. ఐదు రోజుల పాటు మత్యువుతో పోరాడుతూ కూడా తెలంగాణ స్మరణ చేయడమేకాదు.. తాను ఒకవేళ జీవిస్తే తెలంగాణ కోసం మళ్లీ చావడానికైనా సిద్ధమన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+