కేటీఆర్ పరువునష్టం దావా: ఆధారాలు లేక ఆగిన పిటిషన్, రేపు విచారణకు వచ్చే ఛాన్స్...?
అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు ఆరోపణలు చేశారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు. అయితే పిటిషన్‌కు సంబంధించి సరైన ఆధారాలు లేవని కోర్టు బెంచ్ మీదకు వెళ్లలేదు. పరువు నష్టం దావాకు సంబంధించిన సరైన పత్రాలు సమర్పించలేదు.. దీంతో ఈ పిటిషన్ సెక్షన్ ఆఫీస్‌లోనే ఆగింది. మంగళవారం పూర్తి ఆధారాలతో సమర్పిస్తామని కోర్టుకు మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఉద్దేశపూర్వకంగా..
సంబంధం లేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా పేరును వాడుతున్నారని మంత్రి కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని పిటిషన్‌లో కోరారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతోన్న వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును మంత్రి కోరారు. రేవంత్‌రెడ్డిని తగిన విధంగా కోర్టు శిక్షిస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

అసత్య ప్రచారాలు
రాజకీయ దురుద్దేశంతో అసత్యాలను అబద్దాలను ప్రచారం చేస్తోన్న రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తోన్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేకున్నా, రేవంత్ రెడ్డి దురుద్దేశ పూర్వకంగా తన పేరును వాడుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

పరువునష్టం దావా
తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల కలిగిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతోపాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. గౌరవ న్యాయస్థానం తనపై రేవంత్ చేస్తోన్న అసత్య ప్రచారాలను గుర్తించి, ఇలాంటి దురుద్దేశ కార్యక్రమాలకు పాల్పడుతున్న నిందితులను తగిన విధంగా శిక్షిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ అన్నారు.
Recommended Video

మరీ రాహుల్ గాంధీ..
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తాను ఎలాంటి టెస్టులకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్టుకు సిద్ధమైతే.. తానే ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి తనది కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక వేళ తాను టెస్టులు చేయించుకుని, క్లీన్‌చీట్‌తో వస్తే రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పి, పదవులు వదులుకుంటారా? అని కేటీఆర్ సూటిగా అడిగారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టులకు రేవంత్ సిద్ధమా? అని కేటీఆర్ అడిగారు. ఈ క్రమంలోనే పరువు నష్టం దావా వేశారు. ఆధారాలు లేకపోవడంతో ఆగింది. మంగళవారం ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిగే అవకాశం ఉంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications