కేటీఆర్ కనిపించడం లేదు.. శివారుప్రాంత వాసుల నిరసన.. కారణమిదే..?
ఇటీవల హైదరాబాద్, శివారులో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో జనం ఇబ్బందులు మాములగా లేవు. గ్రౌండ్ ప్లోర్‌లో ఉన్నవారి వెతలు మాములుగా ఉండవు. అయితే ఎన్నికల సమయంలో అదీ చేస్తాం.. ఇదీ చేస్తాం అని నేతలు చెప్పేవారు. కానీ తర్వాత పట్టించుకునే నాథుడే లేడు. ఇదీ మరోసారి రుజువు అయ్యిందని శివారు ప్రాంత ప్రజలు అంటున్నారు. ఈ మేరకు తమదైన శైలిలో నిరసన తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో వర్షపునీరుతో జనం ఇబ్బందులు పడ్డారు. సిటీ శివారులో పరిస్థితి చెప్పక్కర్లేదు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కనిపించడం లేదంటూ పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో గల జల్ పల్లి, బడంగ్ పేట్, బాలాపూర్, ఉస్మాన్ నగర్ ప్రాంతాల్లో పోస్టర్లు కనిపించాయి. మిస్సింగ్... ఇతడ్ని మీరు చూశారా? అంటూ కేటీఆర్ ఫొటోతో ఆ పోస్టర్లు రూపొందించారు. తమ ప్రాంతాల్లో వరద సంబంధిత సమస్యలపై ఎన్ని మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందించడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల ప్రజలు పోస్టర్ల ద్వారా తమ నిరసన తెలియజేశారు.

వర్షాకాలం వస్తే చాలు... లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర సర్వీసులు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వారు వాపోతున్నారు. కేటీఆర్ ఎప్పుడూ సింగపూర్, డల్లాస్ గురించే మాట్లాడుతుంటారని, కానీ ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఒక్కసారి వచ్చి పరిశీలించాలని పలువురు కోరుతున్నారు.
గులాబ్ తుఫాన్ చేసిన బీభత్సం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చేతికి వచ్చిన మక్క పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక హైదరాబాద్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఇటీవల కురిసిన వర్షంతో హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసుల సూచించారు. బయట ఉన్నవారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. ఎక్కడికక్కడ యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications