Pushpa2: సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్..

బుధవారం సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనపై పుష్ప2 మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. సోషల్ మీడియా వేదిక ఒక ప్రకటన చేసింది.
పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటనతో తాము చాలా బాధపడినట్లు పేర్కొంది. అస్వస్థతకి గురైన బాలుడు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వివరించింది. అలాగే బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నామని గుర్తు చేసింది. కష్ట సమయంలో బాధితుల కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది.

సాధ్యమైనంత సహాయం చెయ్యడానికి కృషి చేస్తామని ఎక్స్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ ఘటనపై అల్లు అర్జున్ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. కాగా బుధవారం హైదరాబాద్ పుష్ప2 ప్రీమియర్ షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీంతో సిటీలీ పలు థియేటర్లు, మల్టీప్లెక్స్ ల్లో షో వేశారు. దిల్ సుఖ్ నగర్ చెందిన భాస్కర్, రేవతి, వారి కొడుకు శ్రీతేజ, కుమార్తే సన్వీక పుష్ప2 ప్రీమియర్ షో చూడడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వచ్చారు. అయితే అక్కడికి అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా చొచ్చుకొచ్చారు.

Mythri Movie Makers team responds to the incident at Sandhya Theater

దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. దీంతో రేవతి, శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేవతి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శ్రీతేజ ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా తన కుమారుడు అల్లు అర్జున్ ఫ్యాన్ అని అతడి కోసమే ప్రీమియర్ షోకు వెళ్లినట్లు బాలుడి తండ్రి భాస్కర్ చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+