నవీన్ హత్య కేసు: ప్రధాన నిందితుడు హరిహరకృష్ణతోపాటు మరో యువతి, యువకుడి పేర్లు

Naveen murder case: నవీన్ హత్య కేసు: ప్రధాన నిందితుడు హరిహరకృష్ణతోపాటు మరో యువతి, యువకుడి పేర్లు

హైదరాబాద్: నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగని నవీన్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల జాబితాలో హరికృష్ణ ప్రియురాలు, అతని స్నేహితుడి పేర్లను కూడా చేర్చారు పోలీసులు. తాను ప్రేమించిన యువతి కోసమే నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసినట్లు పోలీసుల నిర్ధరించారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా ఆ యువతిపై కేసు నమోదు చేశారు.

నవీన్‌ను అత్యంత దారుణంగా హత్య చేసిన హరిహరకృష్ణ

నవీన్‌ను అత్యంత దారుణంగా హత్య చేసిన హరిహరకృష్ణ

ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ ప్రేమించిన నిహారిక రెడ్డిని ఏ3, అతని స్నేహితుడు హసన్‌ను ఏ2గా పోలీసులు చేర్చారు. వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ మీడియాకు వెల్లడించారు. ఫిబ్రవరి 17న నవీన్ ను హరిహరకృష్ణ హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నవీన్‌ను అత్యంత దారుణంగా హత్య చేసి, తల, గుండె, చేతివేళ్లు, మర్మాంగాలను అతని శరీరం నుంచి వేరు చేశాడు. వాటిని సంచిలో వేసుకుని ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి వెళ్లాడు.

హత్య అనంతరం స్నేహితురాలు, స్నేహితుడితో హరిహరకృష్ణ

హత్య అనంతరం స్నేహితురాలు, స్నేహితుడితో హరిహరకృష్ణ

ఆ తర్వాత అవయవాలను హసన్‌తో కలిసి మన్నెగూడ పరిసరాల్లో పడేశాడు. అక్కడి నుంచి హసన్ ఇంటికి చేరుకుని దుస్తులను మార్చుకుని రాత్రి అక్కడే ఉండి, 18వ తేదీ ఉదయం బీఎన్ రెడ్డినగర్‌లో ఉండే స్నేహితురాలి దగ్గరికి వెళ్లాడు. ఆమెకు నవీన్‌ను హత్య చేసిన విషయం చెప్పి.. ఖర్చుల కోసం రూ. 1500 తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఫోన్లో వీరిద్దరితో హరిహరకృష్ణ ఫోన్లో మాట్లాడాడు. 20వ తేదీ సాయంత్రం మరోసారి స్నేహితురాలి దగ్గరికి వెళ్లి.. ఆమెను బైక్‌పై ఎక్కించుకుని నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లాడు. దూరం నుంచి నవీన్ మృతదేహాన్ని చూపించాడు. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడని డీసీపీ వివరించారు.

అరెస్ట్ భయంతో.. ప్రియురాలి ఇంటికెళ్లిన హరిహరకృష్ణ

అరెస్ట్ భయంతో.. ప్రియురాలి ఇంటికెళ్లిన హరిహరకృష్ణ

21వ తేదీ నవీన్ కుటుంబసభ్యులు హరిహరకృష్ణకు ఫోన్ చేసి ఆచూకీ గురించి ఆరా తీయడంతో హత్య విషయం బయటపడుతుందనే భయంతో అతడు పారిపోయినట్లు డీసీపీ తెలిపారు. అప్పటికే పోలీసులు హరిహరకృష్ణ కోసం గాలిస్తున్నట్లు అతడి తండ్రికి తెలియడంతో.. వెంటనే పోలీసులకు లొంగిపోవాల్సిందిగా కుమారుడికి సూచించాడు. ఈ క్రమంలో 24న హరిహరకృష్ణ హైదరాబాద్ వచ్చి హసన్ దగ్గరకు వెళ్లాడు. హసన్, హరిహరకృష్ణ ఇద్దరూ మన్నెగూడలో నవీన్ శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లారు. వాటిని తిరిగి తీసుకుని హత్య చేసిన ప్రదేశానికి వచ్చి అక్కడే తగలబెట్టారు. ఆ తర్వాత స్నేహితురాలు నిహారిక రెడ్డి ఇంటికి వెళ్లి స్నానం చేశారు. ఆ సమయంలో స్నేహితురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. అక్కడ్నుంచి బయల్దేరిన హరిహరకృష్ణ నేరుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో చెబుతామన్నారు.

సోమవారం రాత్రి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిహారిక రెడ్డి, హసన్ ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు పోలీసులు. అనంతరం వారిని విచారించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+