మీ నాన్న లేకుండా పెళ్లి చేసుకుంటారా..? మంత్రి కేటీఆర్‌కు నెటిజన్ ప్రశ్న
కరోనా వల్ల తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. సడలింపులు ఉన్నా.. లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. మిగిలిన వారికి నో చెప్పెయడంతో వారి బాధ మాములుగా లేదు. ప్రత్యేక అవసరాలు ఉంటే మాత్రమే ఈ పాస్ కు అప్లై చేసుకోవాలని పోలీసులు సూచించారు.
పెళ్లి కోసం తండ్రి ఈ పాస్ కోసం దరఖాస్తు పెట్టుకున్న ఓ వ్యక్తికి షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. తండ్రికి ఈ పాస్ ఇవ్వడం కుదరదని.. కేవలం ఫ్యామిలీకి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. దాంతో ఆ వ్యక్తి ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌ను, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ను ప్రశ్నిస్తూ.. పోస్టు చేశారు. 'గ్రేట్ రాచకొండ పోలీస్ కమిషనరేట్.. పెళ్లికి అటెండ్ అవ్వాలని మా నాన్న ఈ పాస్ అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్ చేశారు. కేవలం ఫ్యామిలీ మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. నా తండ్రి అంటే నా రక్త సంబంధం కాదా.. కేటీఆర్.. తండ్రి లేకుండా పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించాడు.

దీనిపై మరొ యువతి కూడా స్పందించారు. అవును కేటీఆర్ స్పందించండి. సమాధానం ఇవ్వాలని అడిగారు. దీంతో రాచకొండ పోలీసులు ఎంటర్ అయ్యారు. మీ రిఫరెన్స్ ఐడీ ఇవ్వాలని కోరారు. ఆ వెంటనే ఈ పాస్ అప్రూవ్ అయ్యిందని చెప్పారు. సదరు నెటిజన్ కు అదే విషయాన్ని రీట్వీట్ చేసి తెలియజేశారు.
దీనినిబట్టి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేస్తే కానీ మన పోలీసులు స్పందించరు అని అర్థం అవుతుంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనేమో అనే సందేహాం కూడా కలుగుతుంది.
The great @RachakondaCop has rejected epass application for my own father to attend my marriage. Saying a reason only family is allowed. Isn't my father my blood relative.@KTRTRS would you get married without your father #KCR?
— srinu (@srinu2100) June 1, 2021












Click it and Unblock the Notifications