పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్.. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం నిర్ణయం..
తెలంగాణలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ధరణి పోర్టల్‌పై హైకోర్టు అభ్యంతరాలు తెలుపడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్లాట్స్ బుకింగ్ నిలిపివేయమని ఆదేశించారు. సోమవారం నుంచి కార్డ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరుపుతామని స్పష్టంచేసింది. అయితే ఇదివరకే స్లాట్ బుక్ చేసుకుంటే.. వారికి ఆ స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడించింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్.. రిజిస్ట్రార్ కాకుండా తహశీల్దార్ చేస్తారు.
Recommended Video

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల స్లాట్ బుకింగ్ నిలిపివేస్తున్నామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్లాట్ బుకింగ్‌లు నిలిపివేసున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 21న రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ధరణి విషయంలో ప్రభుత్వం నచ్చిన విధంగా ప్రవర్తిస్తోందని మండిపడింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్, కులం, వ్యక్తిగత వివరాలను నమోదు చేయబోమన్న హామీని ఎందుకు ఉల్లంఘించారో తెలపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ధరణి పోర్టల్‌పై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
ధరణి పోర్టల్ గురించి తొలి నుంచి అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం వ్యక్తిగత వివరాలు నమోదు చేయనని చెప్పి.. ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి వివరాలు సమర్పించాలని ఆదేశించడంతో.. ప్రభుత్వం వెనక్కి తగ్గింది.












Click it and Unblock the Notifications