Hyderabad: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు.
జులై 28,29న నిర్వహించే పాతబస్తీ సింహవాహిని మహంకాళీ బోనాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. 28, 29 తేదీల్లో ఫలక్ నుమా, చార్మినార్, మీర్ చౌక్, బహదూర్ పురా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో, నయాపూల్ నుంచి అక్కన్న మాదన్న టెంపుల్ వరకు వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
బోనాల సందర్భంగా ఛత్రినాక ప్రాంతంలో, లాల్ దర్వాజా సింహవాహినీ శ్రీమహాకాళి అమ్మవారి ఆళయం దగ్గర నుంచి అక్కన్న మాదన్న టెంపుల్ వరకు ఏనుగుపై ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆషాఢ మాసంలో అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వండి గ్రామ దేవతలకు సమర్పిస్తారు. మహిళలు బోనాలను తలపై పెట్టుకొని మేళ తాలులు, డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి తీసుకెళ్లి బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈ నేపథ్యంలో ఆంక్షలు విధించారు. సింహవాహిని శ్రీ మహాంకాళి లాల్ దర్వాజా టెంపుల్ రోడ్ వైపు నెహ్రూ విగ్రహం లాల్ దర్వాదా నుంచి వాహనాలకు అనుమతి లేదు. హిమ్మత్ పూరా, షంషీర్ గంజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను నాగుల చింత, గౌలిపురా వైపు వెళ్లనున్నాయి. చాంద్రాయణగుట్ట, కందికల్ గేట్, ఉప్పుగూడ వైపు నుంచి వచ్చే వెహికిల్స్ ను లాల్ దర్వాజా వైపు అనుమతించమని పోలీసులు తెలిపారు. ఛత్రినాక ఔట్ పోస్ట్ దగ్గర గౌలిపుర, నాగుల చింత వైపు వాహనాలను మళ్లిస్తామని వివరించారు.
పాతబస్తీలోని లాల్ దర్వాజ్ బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తోన్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి బోనాలు తీసుకొస్తున్నారు. సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అటు అంబర్ పేటలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతోన్నాయి. ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఉన్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.












Click it and Unblock the Notifications