OU Arts College: ట్రేడ్ మార్క్ భవనంగా ఆర్ట్స్ కాలేజీకి గుర్తింపు..!
ఉస్మానియా యూనివర్సిటీ (OU)లోని ఐకానిక్ ఆర్ట్స్ కాలేజీ భవనం దేశంలో మూడో ట్రేడ్‌మార్క్ భవనంగా అవతరించింది. ఒకటి, రెండో స్థానాల్లో తాజ్ మహల్ హోటల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనాలు ఉన్నాయి. ఆర్ట్స్ కాలేజీ భవనం డిసెంబర్ 4, 2024 నాటికి 85 సంవత్సరాలు పూర్తవుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం దాదాపు 100 సంవత్సరాల క్రితం స్థాపించినప్పటికీ, ఈ అద్భుతమైన భవనం 1939లో ప్రారంభించే వరకు తాత్కాలిక నిర్మాణాల నుంచి బోధించారు.
హైదరాబాద్‌కు చెందిన VII నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీని నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భవనం పూర్తయ్యేలా చూసుకున్నాడు. ఆర్ట్స్ కాలేజీ భవనం నిర్మించే ముందు విశ్వవిద్యాలయ డిజైన్లు, నిర్మాణ శైలులను అధ్యయనం చేయడానికి నిపుణులను విదేశాలకు పంపారు. గోపురాలతో ఆ కాలంలోని అనేక ఇతర భవనాల మాదిరిగా కాకుండా, నిజాం ఆర్ట్స్ కళాశాల సెక్యులర్‌గా కనిపించాలని కోరుకున్నారు.

దీని డిజైన్ హిందూ, ముస్లిం, బౌద్ధ, జైన, పాశ్చాత్య నిర్మాణ శైలులను మిళితంగా నిర్మించారు. ఏప్రిల్ 2024లో భవనం బాహ్య డిజైన్‌పై ట్రేడ్‌మార్క్ కోసం OU దరఖాస్తు చేసింది. ట్రేడ్‌మార్క్ జర్నల్‌లో ప్రచురణ కోసం దరఖాస్తు ఆమోదించారు. 4-5 నెలల్లో ట్రేడ్ మార్క్ భవనాల్లో జాబితాలో నమోదు కానుంది.ట్రేడ్‌మార్క్ అయిన తర్వాత ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ తాజ్ మహల్ హోటల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో ట్రేడ్‌మార్క్ భవనాలుగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఈఫిల్ టవర్, సిడ్నీ ఒపెరా హౌస్ వంటి ప్రసిద్ధ కట్టడాలు ఇప్పటికే అలాంటి ట్రేడ్‌మార్క్‌లను కలిగి ఉన్నాయి.ఈ ఘనతపై ఓయూ ఉపకులపతి ప్రొ.ఎం.కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ట్రేడ్‌మార్క్‌ల ద్వారా వారసత్వ సంపదను కాపాడుకునేందుకు ఈ గుర్తింపు చారిత్రక శిల్పకళతో ఇతర విశ్వవిద్యాలయాలకు స్ఫూర్తినిస్తుందని ఆయన చెప్పారు. ఆర్ట్స్ కాలేజీని గర్వించదగిన బ్రాండ్‌గా మారుస్తుందని ఓయూ పూర్వ విద్యార్థి, ట్రేడ్‌మార్క్ నిపుణుడు సుభాజిత్ సాహా అన్నారు.
టి-హబ్, టి-వర్క్స్, తెలంగాణ సెక్రటేరియట్ వంటి తెలంగాణలోని ఇతర ప్రసిద్ధ భవనాలు వాటి ప్రత్యేకమైన డిజైన్‌ల కోసం ట్రేడ్‌మార్క్‌లను పొందేందుకు ప్రయత్నించవచ్చని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications